Asianet News TeluguAsianet News Telugu

కొడంగల్ లో హైడ్రామా.. వివరణ ఇచ్చిన అడిషనల్ డీజీ

కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలను వ్యతిరేకిస్తూ.. రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.

additional dg gave clarity over raids in kodangal
Author
Hyderabad, First Published Dec 2, 2018, 9:56 AM IST

శనివారం రాత్రి కొడంగల్ నియోజకవర్గంలో హైడ్రామా నడిచింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలను వ్యతిరేకిస్తూ.. రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. దీనిపై అడిషనల్ డీజీ జితేందర్ వివరణ ఇచ్చారు.

రేవంత్ ఇంట్లో సోదాలు జరిగాయనడంలో నిజం లేదన్నారు. కొడంగల్ లోని రేవంత్ ఇంట్లో ఎలాంటి సోదాలు జరగలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన యూసఫ్ అనే వ్యక్తి ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదులు రావడంతో ఆయన ఇంట్లో తనిఖీలు చేశామని, అనుమానం ఉన్న ప్రతిచోటా సోదాలు జరుపుతున్నామని ఏడీజీ వెల్లడించారు. కొడంగల్‌లో అధికార పార్టీ అభ్యర్థి అనుచరుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. అయితే, యూసఫ్ ఇంట్లో ఎంత నగదు దొరికిందన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. 

రేవంత్, ఆయన అనుచరుల ఇళ్లలో పోలీసులు, ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడానికి వచ్చినట్లు కొడంగల్‌లో వార్తలు వ్యాపించాయి. దీంతో రేవంత్ అనుచరులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కొడంగల్ కూడలికి చేరుకున్నారు. అలాగే తన అనుచరులతో కలిసి రేవంత్ రెడ్డి కొడంగల్ చౌరాస్తాలో నిరసనకు దిగారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి ఇంట్లో దొరికిన డబ్బుకు పోలీసులు లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి నిరసనతో కొడంగల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 

related news

కొడంగల్‌లో రేవంత్ అనుచరుల ఇళ్లలో సోదాలు

Follow Us:
Download App:
  • android
  • ios