టీపీసీసీ కార్యానిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుచరుల ఇళ్లపై పోలీసులు దాడులు జరిపారు. శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో కొడంగల్‌లోని రేవంత్ ప్రధాన అనుచరులైన మహ్మద్ యూసఫ్, నందారం ప్రశాంత్ తదితరుల ఇళ్లలో మఫ్టీలో వచ్చిన పోలీసులు సోదాలు నిర్వహించారు.

సమాచారం అందుకున్న రేవంత్ రెడ్డి అనుచరులను వెంటబెట్టుకుని ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులను వెంటబెట్టుకుని తాండూరు-మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. తనిఖీలు చేసింది ఎవరో తనకు తెలియజేయాలని అధికార పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.