సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్.. ప్రారంభించిన ఎస్వీకే సెక్రెటరీ ఎస్ వినయ కుమార్
హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్‌ను ఎస్వీకే సెక్రెటరీ ఎస్ వినయ కుమార్ మంగళవారం ప్రారంభించారు. సైడ్ ఎఫెక్ట్స్, ఔషధాలు లేని ఈ వైద్య సేవలు వినియోగించుకోవాలని అన్నారు. ధరలు అందుబాటులో ఉంచి వైద్య సేవలు అందరికీ చేరేలా కృషి చేయాలని ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సంపాదకులు కే రామచంద్రమూర్తి అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఎస్వీకే సెక్రెటరీ ఎస్ వినయ కుమార్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సంపాదకులు కే రామచంద్రమూర్తి హాజరయ్యారు.
ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఎస్ వినయ కుమార్ మాట్లాడుతూ, ఔషధాలు, సైడ్ ఎఫెక్ట్‌లు లేని ఆక్యుపంక్చర్ విధానాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి హాజరైన కేంద్ర కమిటీ సభ్యులు జీ బుచ్చి రెడ్డి మాట్లాడుతూ, ఈ ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్ ప్రజలకు మంచి వైద్య సేవలు అందిస్తుందని ఆశించారు. అనుభవజ్ఞుడైన హీలర్ కాపర్తి జనార్దన్ ఈ హీలింగ్ సెంటర్‌లో సమర్థవంతంగా సేవలు అందిస్తారని ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సంపాదకులు కే రామచంద్రమూర్తి భరోసా ఇచ్చారు. ఈ వైద్యాన్ని అందరికీ అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. ఇందుకోసం అందుబాటులో ఉండే ధరలనే నిర్ణయించాలని, తద్వార అందరికీ ఆరోగ్యం అనే లక్ష్యం కోసం కృషి చేయాలని కోరారు.
Also Read: ఆగస్ట్ 1న భార్యా బాధితుల సంఘం సమావేశం.. ప్రభుత్వానికి తెలిపేలా...
ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్ సోమవారం మినహా అన్ని వారాలు అందుబాటులో ఉంటుందని సుందరయ్య విజ్ఞాన కేంద్రం మేనేజర్ ఆర్ వి రమణారావు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఈ హీలింగ్ సెంటర్ తెరిచి ఉంటుందని వివరించారు.
ఆక్యుపంక్చర్ హీలింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మెట్రో చానల్ అభినేత దేవరకొండ కాళిదాస్, తెలంగాణ సాహిత కార్యదర్శి ఆనదాచారి, టి బ్రహ్మచారి, హెచ్ఆర్ నారాయణ రావు, హీలర్స్ సుమలత తదితరులు పాల్గొన్నారు.