టిఆర్ఎస్ లోకి హీరోయిన్ సంగీత

Actress Sangeetha to join in TRS
Highlights

సినీ గ్లామర్ తో గులాబీ గుబాలింపు

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి సినీ గ్లామర్ తక్కువగానే ఉందని చెప్పాలి. అప్పట్లో తెలంగాణ రాకముందు అగ్ర నటిగా వెలుగొందిన విజయశాంతి టిఆర్ఎస్ లో పనిచేశారు. కానీ ఆమె తర్వాత కాలంలో టిఆర్ఎస్ ను వీడారు. ఆమె వెళ్లిన తర్వాత అంతటి గ్లామర్ ఉన్న సినీతారలెవరూ పార్టీలో లేరనే చెప్పాలి. కమెడియన్ పాత్రలు చేసి జనాలను మెప్పించిన బాబూమోహన్ ప్రస్తుతం టిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా ఉన్నారు.

సినీ ఇండస్ట్రీకి చెందిన దిల్ రాజు కూడా టిఆర్ఎస్ లో చేరతాని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆ కార్యక్రమం ఇంకా జరగలేదు. అయితే ఎవరూ ఊహించని సినీ తార ఒకరు టిఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

సినీ నటి సంగీత టిఆర్ఎస్ లో చేరనున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై సంగీత స్పందించారు. ఇటీవల ఒక టివి షోలో క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాలంటే పెద్దగా ఆసక్తి లేదన్నారు. పదవీ వ్యామోహమూ లేదని తేల్చి చెప్పారు. అయితే తాను తెలంగాణకు చెందిన వరంగల్ అమ్మాయినే  కాబట్టి తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీలో సాధారణ సభ్యురాలిగా మాత్రమే చేరాలనుకున్నట్లు వెల్లడించారు. రాజకీయంగా సినీ ఇండస్ట్రీకి ఏదైనా మేలు చేయడం కోసమే తన ప్రయత్నం అన్నారు. పేద కళాకారులకు ప్రభుత్వం సాయం అందేలా చేస్తే  చాలన్నారు. గతంలో కేసిఆర్ ను కలిసినట్లు చెప్పారు. సినీ పరిశ్రమకు మేలు చేకూర్చేందుకే టిఆర్ఎస్ లో చేరానుకున్నట్లు చెప్పారు. కానీ ఎప్పుడు పార్టీలో చేరతారన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

loader