వికారాబాద్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుంభవృష్టి ధాటికి అనంతగిరి ఆలయం నీట మునిగింది. ఆలయం పై నుంచి కింద వరకు వరద నీరు ధారలా ప్రవహిస్తోంది.

ఇప్పటికే నీళ్ల గుండం పూర్తిగా నీట మునిగిపోయింది. ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఇక్కడే షూటింగ్‌లో ఉంది. వరద పోటు పెరగడంతో షూటింగ్ నిలిపివేశారు. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌.

Also Read:రకుల్ మెడకు డ్రగ్స్ కేసు, టాలీవుడ్ పై దృష్టి: కేసీఆర్ కు చిక్కులు, బిజెపి వ్యూహం ఇదీ...,

క‌థానుగుణంగా వికారాబాద్ అడ‌వుల్లో చిత్రీక‌ర‌ణ‌ను ప్లాన్ చేశాడు క్రిష్‌. 40 రోజుల్లోనే సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తి చేయాల‌ని ఫిక్స్ అయ్యాడు క్రిష్. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్ మెంట్ బ్యాన‌ర్ పై సాయిబాబు జాగ‌ర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.

కాగా, ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఆరోపణలు వచ్చిన రోజే ఇక్కడ షూటింగ్ చేస్తున్న రకుల్ అనంతరం స్పాట్ నుంచి వెళ్లిపోయారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గత మూడు రోజులుగా తెలంగాణలోని వికారాబాద్ శివారులో ఓ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో గల తన నివాసం నుంచి మూడు రోజుల క్రితం ఆమె షూటింగ్ కోసం వెళ్లారు.