ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో దేవాలయాలపై వరస దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కాగా... ఈ దేవాలయాలపై జరుగుతున్న దాడులపై స్పందించినందుకు తనపై వ్యభిచారణిగా ముద్ర వేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారంటూ నటి, బీజేపీ నేత మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగి.. ప్రాణాల మీదకు వచ్చే పరిస్థితి తెస్తే.. తాను ఎవరినైనా చంపేస్తానంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సోషల్‌ మీడియాలో తనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతూ అశ్లీల పోస్టులు పెట్టి, అసభ్యకర రాతలు రాసి ట్రోల్‌ చేసినవారిపై చర్యలు తీసుకోవాలని  గురువారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘విజయ్‌ మహరాజ్‌ అనే వ్యక్తి నన్ను టార్గెట్‌ చేసి ఫేస్‌బుక్‌లో అసభ్యకర పోస్టులు, మెసేజ్‌లు పెట్టి వేధిస్తున్నాడు. నన్ను అసభ్యకరంగా చిత్రీకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే సైబర్‌ క్రైమ్‌ పోలీ్‌సస్టేషన్‌ ముందు ధర్నా చేస్తా’ అని అన్నారు.