Asianet News TeluguAsianet News Telugu

పీవీ సింధుకు సినీ నటుడు శివారెడ్డి సన్మాసం..

ఈ సందర్భంగా ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫోటోను  సింధుకు బహూకరించానని చెప్పుకొచ్చారు. తన కామెడీ ఎంతో బాగుంటుందని సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను అభినందించారని శివారెడ్డి పేర్కొన్నారు.  

actor shiva reddy meets pv sindhu and honored her in hyderabad
Author
Hyderabad, First Published Aug 9, 2021, 12:32 PM IST

టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును సినీ నటుడు శివారెడ్డి సత్కరించారు. ఆదివారం ఆమె నివాసానికి వెళ్లి వరుసగా 2 ఒలింపిక్స్ పతకాలు సాధించడం గర్వకారణమని అభినందించారు. రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఆమె పతకం సాధించిన సందర్భంలోని ఫోటోను  సింధుకు బహూకరించానని చెప్పుకొచ్చారు. తన కామెడీ ఎంతో బాగుంటుందని సింధుతో పాటు ఆమె కుటుంబ సభ్యులు తనను అభినందించారని శివారెడ్డి పేర్కొన్నారు.  కాగా, టోక్యో 2020 ఒలింపిక్స్లో మహిళల బ్యాడ్మింటన్ విభాగంలో తెలుగు తేజం పీవీ సింధు కాంస్య పతకం సాధించి మువ్వన్నెల జెండాను రెపరెపలాడించిన సంగతి తెలిసిందే. 

కాగా, టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కి ఎట్టకేలకు రెండో పతకం దక్కింది. భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు, కాంస్య పతక పోరులో విజయం సాధించింది. పీవీ సింధు గెలిచిన కాంస్యంతో, టోక్యో ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 2కి చేరింది.

రెజ్లర్ సుశీల్ కుమార్ తర్వాత రెండు ఒలింపిక్స్‌ మెడల్స్ గెలిచిన భారత అథ్లెట్‌గా నిలిచింది పీవీ సింధు. రియో ఒలింపిక్స్‌లో పీవీ సింధు రజత పతకం గెలిచిన విషయం తెలిసిందే. 

కాంస్యపతక పోరులో చైనాకి చెందిన హీ బింగ్ జివో‌తో జరిగిన మ్యాచ్‌లో 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించిన పీవీ సింధు, భారత్‌కి పతకాన్ని అందించింది.

మొదటి సెట్‌లో 6-6 నిలిచిన తర్వాత దూకుడు పెంచిన పీవీ సింధు, వరుస పాయింట్లు సాధించింది. హీ బింగ్ జివో చేసిన తప్పిదాలు కూడా సింధుకి కలిసి వచ్చాయి. 11-8 తేడాతో ఫస్ట్ సెట్ హాఫ్‌ను ముగించిన పీవీ సింధు, ఆ తర్వాత 21-13 తేడాతో మొదటి సెట్‌ను గెలుచుకుంది.

రెండో గేమ్‌లో హీ బింగ్ జివో దూకుడు చూపించింది. అయితే సింధు కూడా అద్బుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చి 11-8 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. బ్రేక్ తర్వాత వరుస పాయింట్లు సాధించిన హీ బింగ్ 11-11 తేడాతో స్కోరును సమం చేసింది. అయితే బ్రేక్ తర్వాత సింధు దూకుడు పెంచి వరుస పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. 

అంతకుముందు టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కి ఆశించిన ఫలితాలు దక్కలేదు. గోల్ఫ్‌‌లో భారత గోల్ఫర్ ఉదయన్ మానే, 56వ ర్యాంకులో నిలిచి తీవ్రంగా నిరాశపరిచాడు...

మరో భారత గోల్ఫర్ అనిబ్రర్ లహిరి, టీ42 ర్యాంకులో నిలిచాడు. హెవీ వెయిట్ బాక్సింగ్ ఈవెంట్‌లో భారత బాక్సర్ సతీశ్ కుమార్, క్వార్టర్ ఫైనల్స్‌లో ఉజెకిస్తాన్‌కి చెందిన జలలోవ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-5 తేడాతో ఓడిపోయాడు...
 

Follow Us:
Download App:
  • android
  • ios