తెలంగాణాలో లాక్ డౌన్ పొడిగించాలంటూ హైకోర్టులో పిల్, ఇంకాసేపట్లో విచారణ

సామాజిక కార్యకర్త, సునీత కృష్ణన్... తెలంగాణాలో లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. తెలంగాణాలో కేసులు ఎక్కువవుతున్నందున ప్రజల ఆరోగ్యం, ప్రాణాల దృష్ట్యా లాక్ డౌన్ ను పొడిగించాలని ఆమె హై కోర్టును కోరింది. కోర్టు ఈ రోజు మధ్యాహ్నం దీనిపై విచారణ జరపనుంది. . 

Activist Files PIL In Telangana High Court Seeking An Extension Of Lockdown In The State, To Be Heard Today

తెలంగాణాలో కరోనా కేసులు నానాటికి పెరిగిపోతున్నాయి. దేశంలో లాక్ డౌన్ విధించేకన్నా ముందే తెలంగాణలో లాక్ డౌన్ విధించినప్పటికీ..... కేసులు కంట్రోల్ కాకపోగా అవి అంతకంతకు పెరిగిపోతున్నాయి. లాక్ డౌన్ ని ఎత్తివేసిన దగ్గరి నుండి రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుంది. గాంధీ ఆసుపత్రి కూడా దాపుగా ఫుల్ అయినట్టు సమాచారం. 

ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త, సునీత కృష్ణన్... తెలంగాణాలో లాక్ డౌన్ ను పొడిగించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలు చేసారు. తెలంగాణాలో కేసులు ఎక్కువవుతున్నందున ప్రజల ఆరోగ్యం, ప్రాణాల దృష్ట్యా లాక్ డౌన్ ను పొడిగించాలని ఆమె హై కోర్టును కోరింది. లాక్ డౌన్ ని పొడిగించమని కోరడంతోపాటుగా పేదలకు 7,500 రూపాయలను ఇవ్వాలని ఆమె ఈ పిల్ లో కోరారు. కోర్టు ఈ రోజు మధ్యాహ్నం దీనిపై విచారణ జరపనుంది. . 

తెలంగాణలో కరోనా విలయ తాండవం కొనసాగుతోంది. సోమవారం కొత్తగా 92 మందికి  పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కేసుల సంఖ్య 3,742కి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ కోవిడ్ 19 తో ఐదుగురు మరణించడంతో.. మొత్తం మరణాల సంఖ్య 142కి చేరింది.

మరోవైపు కరోనా లక్షణాలు లేని రోగులను ఆసుపత్రుల నుంచి అధికారులు ఇళ్లకు పంపిస్తున్నారు. తమ ఇళ్లల్లో ప్రత్యేక గదులు కలిగివున్న 310 మందిని హోం క్వారంటైన్‌కు, మిగిలిన 83 మందిని అమీర్‌పేటలోని ప్రకృతి చికిత్సాలయానికి తరలించినట్లు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. 

Also Read:బిగ్ బ్రేకింగ్: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు.. ఎగ్జామ్స్ లేకుండానే పాస్

కాగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కోవిడ్ 19 కలకలం సృష్టించింది. 4వ ఫ్లోర్‌లోని ఒక సెక్షన్‌లో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

నాలుగో అంతస్తు మొత్తాన్ని ఖాళీ చేసి, శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు. ఆ ఫ్లోర్‌లో పనిచేసే ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించారు. కాగా దాదాపు 1,500 మంది ఉద్యోగులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు.

Also Read:మా ఆదేశాలు పట్టించుకోరా.... చర్యలు తప్పవు: తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు ఆదేశం

ఈ ఘటనపై జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు మాట్లాడుతూ.. కార్యాలయంలో ఉద్యోగికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు. కార్పోరేషన్ కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు.

ఆఫీసులోని అన్ని ఫ్లోర్‌లను సిబ్బంది శుద్ధి చేస్తున్నారని.. ఉద్యోగులందరినీ ఒక హెల్త్ ఆఫీసర్ అబ్జర్వేషన్‌లో ఉంచామని రాంబాబు వివరించారు. కమీషనర్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios