Asianet News TeluguAsianet News Telugu

ఏసీబీ సోదాలు: ఏసీపీ నరసింహారెడ్డి విస్తుపోయే ఆస్తుల చిట్టా ఇదే...

మల్కాజిగిరి ఏసీపీ నర్సింహా రెడ్డిపై ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఆయనకు రూ.70 కోట్లకు మించిన ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ACP Narasimha Reddy properties value about Rs 70 crore KPR
Author
Hyderabad, First Published Sep 24, 2020, 7:32 AM IST

హైదరాబాద్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కుంటున్న మల్కాజిగిరి ఏసీబీ వై. నర్సింహా రెడ్డి పెద్ద యెత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. దాదాపు 70 కోట్ల రూపాయల విలువ చేసే అస్తులను అతను కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు అంచనా వేశారు. బుధవారం నర్సింహారెడ్డి నివాసంలోనే కాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. 

ఏసీబీ అధికారుల బృందాలుగా విడిపోయిన హైదరాబాదులోని మహేంద్రహిల్స్ లో గల ఆయన నివాసంలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహించారు. వరంగల్, జనగామ, నల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో, ఏపీలోని అనంతపురంలో సోదాలు జరిగాయి. తెలంగాణ, ఏపీల్లోనే 25 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపారు. 

బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించిన సోదాల్లో నర్సింహారెడ్డికి ఉన్న ఆస్తులను గుర్తించారు. 3 ఇళ్లు, 5 ఓపెన్ ప్లాట్లు, వాణిజ్య స్థలాలతో పాటు రూ. 5 కోట్ల విలువైన ఆస్తులు, బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం అతని అస్తుల విలువల రూ.7.5 కోట్లు కాగా, మార్కెట్ విలువ ప్రకారం రూ.70 కోట్లు ఉంటుందని అంచనా వేశారు 

నర్సింహారెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు ఆయనకు రెండు బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నర్సింహారెడ్డి గతంలో మియాపూర్, ఉప్పల్, బేగంపేట ఇన్ స్పెక్టర్ గా, చిక్కడపల్లి డివిజన్ లో ఏసీపీగా పనిచేశారు అక్కడి నుంచి మల్కాజిగిరికి బదిలీ అయ్యారు. 

ఏసీబీ గుర్తించిన ఆస్తులు ఇవీ....

అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి
సెబర్ టవర్స్ ఎదురుగా 1960 చదరపు గజాల 4 పాట్లు
రెండు చోట్ల ఇంటి స్థలాలు, రెండు ఇళ్లు
హఫీజ్ పేటలో జీ ప్లస్ 3 వాణిజ్య సముదాయాలు
రూ. 15 లక్షల నగదు
రెండు బ్యాంక్ లాకర్లు

Follow Us:
Download App:
  • android
  • ios