Asianet News TeluguAsianet News Telugu

నిజామాబాద్ లో దారుణం... రూ.1000 కోసం స్నేహితుడిపై రాడ్ తో దాడిచేసి, యాసిడ్ పోసి

కేవలం వెయ్యి రూపాయల కోసం స్నేహితుడిపై అత్యంత పాశవికంగా రాడ్ తో దాడి చేయడమే కాదు యాసిడ్ పోసారు ముగ్గురు యువకులు. ఈ దారుణం  నిజామాబాద్ లో చోటుచేసుకుంది. 

acid attack on young boy over thousand rupees
Author
Nizamabad, First Published May 19, 2022, 10:06 AM IST

నిజామాబాద్: కేవలం వెయ్యి రూపాయల కోసం స్నేహితుల మద్య ఘర్షణ చెలరేగి ఒకరి ప్రాణాలమీదకు తెచ్చింది. వెయ్యి రూపాయలు తిరిగివ్వాలని అడిగినందుకే స్నేహితుడిపై రాడ్ తో దాడిచేసి యాసిడ్ పోసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ దారుణం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నిజామాబాద్ నగరంలోని బాబన్ పహడ్ ప్రాంతానికి చెందిన యువకుడు షేక్ కలీం కూలీపనులు చేసుకుంటాడు. ఇతడికి  దొడ్డి కొమురయ్య కాలనీకి చెందిన రంజాని స్నేహం వుంది. ఈ క్రమంలోనే కష్టపడి సంపాదించిన కూలీ డబ్బులు రూ.4500లతో రంజాని వద్ద ఓ సెల్ ఫోన్ కొనుగోలు చేసాడు కలీం. 

అయితే తనకు అమ్మిన సెల్ ఫోన్ దొంగిలించిందిగా కలీంకు తెలిసింది. రంజానితో పాటు అతడు స్నేహితులు ఫారుఖ్, మతిన్ కలిసి ఈ మొబైల్ దొంగిలించి కలీంకు అంటగట్టారు. దీంతో తనకు అమ్మిన సెల్ ఫోన్ తిరిగిచ్చేసి తన డబ్బులు తిరిగివ్వాలని కలీం కోరాడు. దీంతో వారు రూ.3500 తిరిగిచ్చి మిగతా డబ్బులు తర్వాత ఇస్తామన్నారు. 

తనకు రావాల్సిన వెయ్యిరూపాయిలు ఎన్నిరోజులయినా తిరిగివ్వకపోవడతో రంజాని, ఫారుఖ్, మతిన్ లను కలీం గట్టిగా నిలదీసాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఈ ముగ్గురు కలీంపై రాడ్ తో దాడిచేసారు. తీవ్ర గాయాలతో కిందపడిపోయినా వదిలిపెట్టకుండా వాహనాల బ్యాటరీలో ఉపయోగించే యాసిడ్ ను కలీంపై పోసి పరారయ్యారు. 

తీవ్ర గాయాలపాలైన కలీం ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబం కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసామని చెబుతుంటే పోలీసులు మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని చెబుతున్నారు.  

ఇలాంటి దారుణమే హైదరాబాద్ పాతబస్తీలో చోటుచేసుకుంది. వెయ్యి రెండువేల కోసం ఎంతోకాలంగా కలిసి పనిచేస్తున్న స్నేహితున్ని అతి దారుణంగ హతమార్చాడు ఓ యువకుడు. లాభాన్ని పంచుకునే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య మాటామాటా పెరిగి చంపుకునే స్థాయికి చేరింది. ఇలా ఓ డ్రైవర్ సోదరుడు, స్నేహితులతో కలిసి తోటి డ్రైవర్ ను కత్తులతో నరికిచంపాడు.  

హైదరాబాద్ పాతబస్తీ లోని చాంద్రాయణగుట్ట బండ్లగూడ షాహీన్ నగర్ కు చెందిన జహంగీర్ (23), మహ్మద్ అష్రఫ్ (37) ఇద్దరూ ఒకేచోట డిసిఎం డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నాంపల్లిలోని బిస్మిల్లా చికెన్ సెంటర్ లో కోళ్ళను సరఫరా చేసే డిసిఎంను వీరు నడిపేవారు. ఇలా కోళ్ల సరఫరా ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇద్దరూ పంచుకునేవారు. అయితే డబ్బులు పంపకం విషయంలో ఇద్దరి మధ్యా తేడాలు వచ్చాయి. 

ట్రిప్పుకు రూ.3‌వేల నుండి  రూ.4వేల వరకు ఆదాయం రాగా అందులో 60శాతం అష్రఫ్ తీసుకుని కేవలం 40శాతం మాత్రమే తనకు ఇస్తున్నట్లు జహంగిర్ గుర్తించాడు. దీంతో ఇద్దరం సమానంగా కష్టపడుతున్నాం కాబట్టి లాభాలు కూడా సమానంగానే పంచుకుందామని జహంగిరి కోరాడు. ఇందుకు అష్రఫ్ అంగీకరించకపోవడంతో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలోను కోపంలో తనను మోసం చేస్తూ చంపేస్తానని అష్రఫ్ ను జహంగిర్ బెదిరించాడు. 

అయితే జహంగిర్ ఆవేశంలో చంపేస్తానని బెదిరించగా నిజంగానే చంపుతాడేమోనని అష్రఫ్ భయపడిపోయాడు. దీంతో అతడి కంటే ముందుగా తానే చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన సోదరుడు షఫీ(22)తో పాటు స్నేహితులు అర్భాజ్(22), హబీబ్ (26) సాయం తీసుకున్నాడు అష్రఫ్. ఈ నలుగురూ కలిసి జహంగిర్ హత్యకు ప్లాన్ వేసారు. మాట్లాడుకుందామని చెప్పి లంగర్‌హౌస్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే పిల్లర్‌ నం.96 సమీపంలోని వైఫై బార్‌ వద్దకు జహంగిర్ ను పిలిచాడు అష్రఫ్. నిజమేనని నమ్మి అతడు అక్కడికి వచ్చాడు. కానీ అప్పటికే కత్తులతో సిద్దంగా వున్న నలుగురు నిందితులు జహంగిర్ రాగానే ఒక్కసారిగా దాడికి దిగారు. దీంతో రక్తపుమడుగులో పడి జహంగిర్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది నిర్దారించుకున్న తర్వాతే అష్రఫ్ తో పాటు మిగతా ముగ్గురు నిందితులు పరారయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios