వరంగల్ లో అమ్మాయిపై యాసిడ్ దాడి

First Published 29, Nov 2017, 6:41 PM IST
acid attack on warangal girl
Highlights
  • గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు
  • యువతి శరీరమంతా కాలిపోయింది
  • ఎంజిఎం కు తరలింపు.. పరిస్థితి విషమం

వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఘోరం జరిగింది. ఒక యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ సంఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది.

జిల్లాలోని ఐనవోలు మండలం గర్మిల్లపెల్లి గ్రామ శివారులో యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఆమె శరీరమంతా తీవ్రంగా కాలిపోయింది.

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసినట్లు చెబుతున్నారు.

ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.

ఆమె కనీసం మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంది. ఆమె మట్టెవాడ కు చెందిన అమ్మాయిగా చెబుతున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

loader