తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ భార్య సంచలన విషయాలు బయటపెట్టారు. తన భర్త విజయారెడ్డిని  చంపాలని అనుకోలేదని నిందితుడు సురేష్ భార్య లత చెప్పారు.  ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ లో తహసీల్దార్ విజయారెడ్డిని సురేష్ అనే కౌలు రైతు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో సురేష్ కూడా 60శాతం గాయాలపాలయ్యాడు. తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి కన్నుమూశాడు.

ఈ నేపథ్యంలో సురేష్ భార్య లత మీడియాతో మాట్లాడారు. తన భర్తకి అసలు విజయారెడ్డిని చంపాలనే ఆలోచన కూడా లేదని చెప్పింది. ఈ విషయంపై తాను తన భర్తతో మాట్లాడనని చెప్పింది. కేవలం తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. తహసీల్దార్ విజయారెడ్డిని  బెదిరించాలని అనుకున్నాడని ఆమె వివరించింది. అయితే... విజయా రెడ్డి తన భర్త చెప్పేది వినిపించుకోకపోవడంతోనే పెట్రోల్ పోసి తగలపెట్టాడని లత పేర్కొంది.

తాను తన భర్తను కోల్పోయాను అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంది. కేవలం బెదిరిద్దామని వెళ్లి ఆవేశంలో ఈ పని చేశాడని వివరించింది. విజయారెడ్డి హత్య తనకు కూడా బాధ కలిగించిందని ఆమె చెప్పారు. తన భర్త సురేష్ కి వచ్చిన చావు మరే రైతుకి రావద్దని ఆమె కోరుకుంది. ఇప్పటికే అప్పు చేసి మరీ తన భర్త రూ.9లక్షలు కట్టాడని ఆమె తెలిపింది. భూముల వ్యవహారంలోనే ఆ డబ్బు తన భర్త ఎవరికో ఇచ్చాడని ఆమె చెప్పింది.

విజయారెడ్డికి కూడా లంచం ఇచ్చినట్లు తన భర్త తనకు చెప్పినట్లు ఆమె మీడియాకి తెలిపింది. తమ భూముల లెక్క తేల్చండి అని ఆమె ఈ సందర్భంగా కోరింది. 

AlsoRead Tahsildar vijayareddy: నా భర్త అమాయకుడు.. నిందితుడు సురేష్ భార్య

..సోమవారం మధ్యాహ్నం.. విజయారెడ్డిని సురేష్ అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయా రెడ్డిని ఆమె కార్యాలయంలో, ఆమె చాంబర్లో తలుపులు వేసి, పెట్రోలు పోసి కాల్చి చంపేశాడు. ఆమె మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో మాట్లాడే నెపంతో వచ్చి ఈ దౌర్జన్యానికి ఒడిగట్టాడు. కౌలు రైతుకు, భూ యజమానికి మధ్య తలెత్తిన వివాదంలో ఆమె బలైపోయారు.

AlsoRead ఎమ్మార్వో విజయారెడ్డి ఇంటికి సురేష్: భర్త సుభాష్ రెడ్డితో భేటీ, అందుకోసమేనా?...

తనకు పట్టా రాదనే ఉద్దేశంతోనే ఆమెను చంపినట్టు కౌలు రైతు సురేశ్‌ చెప్పాడు. మంటలు అంటుకున్న విజయారెడ్డిని రక్షించేందుకు ప్రయత్నించిన డ్రైవర్‌ కూడా ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం. నిందితుడు సురేష్ కూడా 60శాతం గాయపడగా... అతను ఆస్పత్రిలో  చికిత్స పొందుతున్నాడు. భూ వివాదంలో తహసీల్దార్ తనకు మద్దతు ఇవ్వనందుకే చంపేసినట్లు సురేష్ అంగీకరించాడు. కాగా.. సురేష్ వెనక మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్ కూడా మృతి చెందాడు.