Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. డ్రైవర్ వల్లే..

నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా ఆదివారం బిజినపల్లి మండలంలో పర్యటిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

accident in the convoy of mla marri Janardhan Reddy KRJ
Author
First Published Oct 8, 2023, 11:33 PM IST

నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా బిజినపల్లి మండలంలో పాల్గొని తిరుగు ప్రయాణం అవుతుండగా ప్రమాదం చోటుచేసుకుంది. కానీ, డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.

వివరాల్లోకెళ్తే.. ప్రజా ప్రస్థానం యాత్రలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆదివారం బిజినపల్లి మండలంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆ మండలంలోని కర్వంగా, వసంతాపూర్ మీదుగా వెళ్తుండగా.. కాన్వాయ్ లోని  ఎమ్మెల్యే వాహనం అదుపుతప్పింది. దీంతో పక్కనే ఉన్న వరి పొలాల్లోకి దూసుకుపోయింది.

ఈ క్రమంలో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యేక్ష సాక్షులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ఇతర వాహనంలో ప్రజా ప్రస్థానం యాత్రను కొనసాగించారు. అనంతరం ఎమ్మెల్యే వాహనాన్ని క్రేన్ సహాయంతో బయటకు తీశారు. తన అభిమాన ఎమ్మెల్యేకు తృటిలో పెను ప్రమాదం తప్పడంతో ఆయన అనుచరులు, అభిమానులు ఊపీరి పీల్చుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios