హైదరాబాద్: తెలంగాణ లెక్చరర్ల ఫోరం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ సమాచారంతో ఏసీబీ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహించింది. 

తెల్లవారుజాము నుంచి మధుసూదన్ రెడ్డి నివాసంతోపాటు ఆయన బంధువుల ఇళ్లల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

ఇప్పటికే నగదుతోపాటు కీలక డాక్యుమెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేశామని అయితే అక్రమాస్తులపై వివరణ ఇస్తామని ఏసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 

ఇకపోతే తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడిగా చాలా కాలంగా పనిచేస్తున్నారు మధుసూదన్ రెడ్డి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఆయన తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సుదీర్ఘకాలంగా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మధుసూదన్ రెడ్డి.