Asianet News TeluguAsianet News Telugu

రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డ మరో రెవెన్యూ అధికారి...రంగారెడ్డి కలెక్టరేట్ లో ఏసిబి సోదాలు

ఇటీవల కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ ఓ తహశీల్దార్ అడ్డంగా బుక్కయిన ఘటన మరువక ముందే మరో అవినీతి రెవెన్యూ అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. 

ACB raids on ragareddy collectorate
Author
Rangareddy, First Published Aug 20, 2020, 2:36 PM IST

రంగారెడ్డి: ఇటీవల కోటి రూపాయలకు పైగా లంచం తీసుకుంటూ ఓ తహశీల్దార్ అడ్డంగా బుక్కయిన ఘటన మరువక ముందే మరో అవినీతి రెవెన్యూ అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. సర్వేయర్ సూపరిండెంట్ వెంకటేశ్వర్ రెడ్డి రూ.5000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యండెడ్ గా పట్టుబడ్డాడు. 

సర్వే రీపోర్ట్ ఇవ్వడం కోసం సదరు సర్వేయర్ సూపరిండింట్ వెంకటేశ్వర్ రెడ్డి లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసిబిని ఆశ్రయించాడు. దీంతో రంగంలోకి దిగిన ఏసిబి బాధితుడి నుండి వెంకటేశ్వర రావు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

read more  రిటైర్డ్ ఎస్పీని సైతం ముప్పు తిప్పలు పెట్టిన ఎమ్మార్వో నాగరాజు

మరోవైపు ఇటీవల కొటి రూపాయలకు పైగా లంచం తీఃుకుంటూ పట్టుబడ్డ  కీసర తహాసీల్దార్ నాగరాజు కేసులో ఏసీబీ దర్యాప్తును మరింత ముమ్మరం చేసింది.  ఈ కేసులో నగదు లావాదేవీలు ఎక్కడి నుండి జరిగాయనే కోణంలో విచారణ జరిపేందుకు వీలుగా ఐటీ శాఖకు ఏసీబీ లేఖ రాసింది.

కొన్ని రోజుల క్రితం రూ.1.10 కోట్లు లంచం తీసుకొంటూ కీసర  తహాసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం నాగరాజుతో పాటు ఆయనకు సహకరించిన వారు రిమాండులో ఉన్నారు.  
 
రిమాండులో ఉన్న నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ అధికారులు ఈ నెల 19వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగరాజుతో పాటు శ్రీనాథ్, అంజిరెడ్డిలను విచారిస్తే కీలక విషయాలు వెలుగుచూసే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

నాగరాజు ఆస్తులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నారు. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను కూడ ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇదే కేసులో అరెస్టైన అంజిరెడ్డి, శ్రీనాాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను కూడ ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. 

నాగరాజుకు ఏయే ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయి, వాటి విలువ ఎంత అనే విషయమై కూడ ఏసీబీ అధికారులు లోతుగా పరిశీలన చేస్తున్నారు. విదేశాల్లో కూడ నాగరాజుకు ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే కోణంలో కూడ ఏసీబీ దర్యాప్తు చేయాలని భావిస్తోంది.నాగరాజుకు సంబంధించిన లావాదేవీల విషయమై ఐటీ శాఖకు ఏసీబీ లేఖ రాసింది.

Follow Us:
Download App:
  • android
  • ios