సిద్దిపేట: సిద్దిపేట అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారుల సోదాలు ఒక్కసారిగా కలకలం రేపాయి. బుధవారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు డీసీపీ పరసింహారెడ్డి నివాసాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. 

సిద్దిపేటలోని ఆయన నివాసంతోపాటు కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్‌లోని ఇళ్లలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. డీసీపీ నరసింహారెడ్డితోపాటు సిద్దిపేట వన్‌టౌన్ కానిస్టేబుల్ ఇంట్లో సైతం అధికారులు తనిఖీలు  నిర్వహిస్తున్నారు. 

భారీగా ఆస్తుల కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటి వరకు సిద్ధిపేటలో భారీగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే రూ.30కోట్ల అక్రమ ఆస్తులను సైతం ఏసీబీ అధికారులు గుర్తించినట్లు సమాచారం.