Asianet News TeluguAsianet News Telugu

కోటీ పది లక్షల రూపాయల లంచం: ఏసీబీకి చిక్కిన ఎమ్మార్వో నాగరాజ్

ఏకంగా కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ కీసర ఎమ్మార్వో నాగరాజ్ ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. ఓ భూమి వ్యవహారంలో తప్పు పాస్ పుస్తకాలు జారీ చేసేందుకు అతను అంగీకరించాడు.

ACB officials catch Keesara MRO Nagaraj, while taking bribe
Author
Keesara, First Published Aug 15, 2020, 7:01 AM IST

హైదరాబాద్: కోటీ పది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో అవినీతి నిరోధక శాఖ (ఎసీబీ) అధికారుల చేతికి చిక్కాడు. లంచం తీసుకుంటుడగా కీసర తాహసీల్దార్ నాగరాజ్ ను, అతనికి లంచం ఇచ్చి విలువైన భూమిని కొట్టేయడానికి ప్రయత్నించిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి అనుచరుడిని, దళారిని, వీఆర్ఎను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. 

మేడ్చెల్ జిల్లా కీసర మండలం రాంపల్లి దాయరలో పూర్వీకుల నుంచి ఓ కుటుంబానికి 44 ఎకరాల భూమి వారసత్వంగా వచ్చింది. 1996లో 16 ఎకరాల భూమికి సంబంధించిన హక్కులను ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులకు కల్పిస్తూ అప్పటి ఆర్డీవో ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 28 ఎకరాలపై వివాదం కొనసాగుతూ వస్తోంది. రైతులు అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. 

ఆ వివాదం ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది. ఆ భూమిపై ఓ రియల్ ఎస్టేట్ సంస్థ కన్ను వేసింది. దాన్ని చక్కబెట్టే బాధ్యతను ఓ పార్టీకి చెదిన సీనియర్ నాయకుడి అనుచరుడు అంజిరెడ్డి, ఉప్పల్ కు చెదిన దళారి శ్రీనాథ్ తీసుకున్నారు. తప్పుడు పత్రాలతో పాస్ పుస్తకాలు ఇప్పించేందుకు వ్యూహరచన చేశారు. అందుకు కీసర ఎమ్మార్వో నాగరాజ్ ను ఆశ్రయించారు. అందుకు అతను ఒప్పుకున్నాడు. 

అందుకుగాను కోటీ 10 లక్షల రూపాయలు లంచంగా ఇచ్చేందుకు నాగరాజ్ ఇంటికి అంజిరెడ్డి, శ్రీనాథ్ శుక్రవారం సాయంత్రం వచ్చారు. అప్పటికే ఫిర్యాదులు రావడంతో నాగరాజ్ మీద ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. ఆ క్రమంలో లంచం తీసుకుంటుండగా నాగరాజ్ ను పట్టుకున్నారు. ఆ ముగ్గురితో పాటు రాంపల్లి వీఆర్ఎ సాయిరాజ్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. దాంతో పాటు నాగరాజ్ నివాసంలో మరో రూ.25 లక్షలు దొరికాయి.

Follow Us:
Download App:
  • android
  • ios