Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటు కేసు: డిశ్చార్జీ పిటిషన్లపై నవంబర్ 2న తీర్పు

ఓటుకు నోటు కేసులో తమ పేర్లను తొలగించాలని  ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహలు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలను విన్న  కోర్టు తీర్పును నవంబర్ 2న వెల్లడించనున్నట్టుగా తెలిపింది.

acb Court adjourned cash for vote case on november 2 lns
Author
Hyderabad, First Published Oct 28, 2020, 4:23 PM IST

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తమ పేర్లను తొలగించాలని  ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఉదయ సింహలు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్ లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ఇరు వర్గాల వాదనలను విన్న  కోర్టు తీర్పును నవంబర్ 2న వెల్లడించనున్నట్టుగా తెలిపింది.

ఓటుకు నోటు కేసును  ఈ నెల 12వ తేదీ నుండి రోజువారీగా విచారిస్తోంది ఏసీబీ కోర్టు. ప్రజా ప్రతినిధులపై నమోదైన కేసుల విచారణను వెంటనే  పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఈ కేసు విచారణను రోజువారీ చేపట్టింది ఏసీబీ కోర్టు.

also read:తెరపైకి ఓటుకు నోటు కేసు: ఈ నెల 12 నుండి రోజువారీ విచారణ

ఈ కేసులో తమ పేర్లను తొలగించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయసింహాలు రెండు రోజుల క్రితం  డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. 

అయితే ఈ కేసు నుండి తప్పించుకొనేందుకు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారని ఏసీబీ తరపు న్యాయవాది కోర్టులో తన వాదనను విన్పించారు. 

ఈ కేసుతో తమ ప్రమేయం లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరి తరపున న్యాయవాదులు ఏసీబీ కోర్టుకు తెలిపారు. ఇరువర్గాల వాదనలను బుధవారం నాడు ఏసీబీ కోర్టు వింది. ఇరు వర్గాల వాదనలను విన్న కోర్టు తీర్పును నవంబర్ రెండో తేదీకి వాయిదా వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios