ముగిసిన సస్పెన్షన్, విధుల్లో చేరిన ఏసీబీ ఎఎస్పీ సునీతారెడ్డి

ACB ASP Sunitha Reddy joined in duty
Highlights

ఏసీబీ అదనపు ఎస్పీ సునీతారెడ్డి విధుల్లో చేరారు.  ఆమెపై  విధించిన సస్పెన్షన్  గడువు ముగియడంతో   సునీతారెడ్డి విధుల్లో చేరారు. సునీతారెడ్డి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకొన్న వివాదం కారణంగా పోలీసు ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.


హైదరాబాద్: ఏసీబీ అదనపు ఎస్పీ సునీతారెడ్డి విధుల్లో చేరారు.  ఆమెపై  విధించిన సస్పెన్షన్  గడువు ముగియడంతో   సునీతారెడ్డి విధుల్లో చేరారు. సునీతారెడ్డి వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకొన్న వివాదం కారణంగా పోలీసు ఉన్నతాధికారులు ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు.

ఏసీబీ అదనపు ఎస్పీగా ఉన్న సునీతారెడ్డి విషయమై ఆమె భర్త  ఫిర్యాదు చేశారు.  వ్యక్తిగత విషయమై  సునీతారెడ్డి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సునీతారెడ్డితో పాటు కల్వకుర్తి  సీఐ మల్లిఖార్జున్‌పై కూడ సస్పెన్షన్ వేటు విధించారు.

సునీతారెడ్డి భర్త ఫిర్యాదు మేరకు  ఈ ఘటనపై పోలీసులు ఈ మేరకు చర్యలు తీసుకొన్నారు. ఈ ఏడాది జనవరి మాసంలో సునీతారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. సస్పెన్షన్ గడువు ముగిసింది. దీంతో  సునీతారెడ్డి  విధుల్లో చేరారు. 

సునీతారెడ్డి  విషయం అప్పట్లో సంచలనంగా మారింది. తనను ఇబ్బందులకు గురిచేశారని సునీతారెడ్డి భర్త అప్పట్లో ఆరోపణలు చేశారు. అంతేకాదు ఫిర్యాదు కూడ చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా  సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే.

సునీతారెడ్డికి కల్వకుర్తి సీఐ మల్లిఖార్జున్‌ రెడ్డి ల మధ్య సంబంధాల విషయమై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపిన పోలీసుశాఖ ఈ మేరకు వారిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసింది.
 

loader