తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కాన్వాయ్ ముందు నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. 

ఇక, కరీంనగర్ జిల్లా పర్యటనలో భాగంగా కేటీఆర్.. కరీంనగర్‌లో రూ.7కోట్లతో నిర్మించిన కరీంనగర్‌ సర్క్యూట్‌ హౌస్‌, ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జమ్మికుంట కాలేజీ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. అయితే కేటీఆర్ కరీంనగర్ జిల్లా పర్యటన నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.