తెలంగాణ  ఇంటర్ బోర్డు ముందు  ఏబీవీపీ  ఇవాళ  ఆందోళనకు దిగింది. ప్రైవేట్  కాలేజీల్లో ఫీజులు నియంత్రించాలని  ఏబీవీపీ డిమాండ్  చేసింది. 

హైదరాబాద్: ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారంనాడు ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలు, నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రైవేటీ కాలేజీల యాజమాన్యాలు విద్యార్ధుల నుండి ఇష్టారీతిలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఏబీవీపీ ఆరోపిస్తుంది. ఫీజుల నియంత్రించడంలో ఇంటర్ బోర్డు వైఫల్యం చెందిందని ఏబీవీపీ ఆరోపిస్తుంది. ఇంత జరుగుతున్న ఇంటర్ బోర్డు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇవాళ ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి వెళ్లేందుకు ఏబీవీపీ శ్రేణులు ప్రయత్నించాయి.

అయితే పోలీసులు వారిని నిలువరించారు. ఈ సమయంలో పోలీసులు , ఏబీవీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకు దిగిన ఏబీవీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.