హైదరాబాద్ కోఠిలో సూట్ కేసు వదిలిపెట్టారు.. బాంబ్ అని భయపడ్డ స్థానికులు.. పోలీసులకు సమాచారం
హైదరాబాద్‌లో నిత్యం రద్దీగా ఉండే కోఠిలో బాంబు కలకలం రేగింది. ఆంధ్రబ్యాంక్ జంక్షన్ వద్ద సూట్ కేసు కనిపించింది. కానీ, అది తమది కాదంటే.. తమది అని చెప్పుకున్నారు. దీంతో ఆ సూట్ కేసులో బాంబు ఉన్నదనే అనుమానంతో పోలీసులకు ఫోన్ చేశారు. ఆ సూట్ కేసులో బాంబే లేదని పోలీసులు తేల్చారు.
హైదరాబాద్: అదంతా రద్దీగా ఉండే ఏరియా. నిత్యం కొనుగోలుదారులతో కళకళలాడుతూ ఉంటుంది. ఎప్పుడూ రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో ఎవరికీ చెందని ఒక సూట్ కేసు కనిపించింది. దాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఎవరో వదిలిపెట్టి వెళ్లారని, బహుశా అందులో బాంబు ఉన్నదనే అనుమానాలు స్థానికులకు వచ్చాయి. ఈ ఆలోచనలు రాగానే భయాందళనలకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హైదరాబాద్‌లోని కోఠిలో ఆంధ్రబ్యాంక్ జంక్షన్ దగ్గర ఓ సూట్ కేసు పడి ఉండటాన్ని స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. యాంటీ సబోటేజ్ టీమ్‌కూ పోలీసులు సమాచరాం ఇచ్చారు. కావాల్సిన ముందు జాగ్రత్తలను వారు తీసుకున్నారు. ఆ తర్వాత అధికారులు అనుమానంతో సూట్ కేసు విప్పారు. అందులో పర్ఫ్యూమ్ బాటిళ్లు కనిపించాయి.
ఆ తర్వాత ఓ మహిళకు అక్కడికి వచ్చింది. ఆ సూట్ కేసు తనదేనని వివరించింది. తాను షాపింగ్ కోసం వచ్చి అక్కడ సూట్ కేసు కింద పెట్టి మర్చిపోయానని ఆ మహిళ తెలిపింది. పోలీసులు ఆ సూట్ కేసును సదరు మహిళకు అప్పజెప్పారు.