గర్ల్ ఫ్రెండ్ తో హోటల్ రూంలో ఏకాంతంగా గడిపిన క్షణాలు వీడియో రూపంలో బయటకు రావడంతో ఆ యువకుడు షాక్ కు గురయ్యాడు. వెంటనే సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ప్ర‌స్తుతం ప్రైవెసీ అనేది పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఎవ‌రు ఎక్క‌డికి వెళ్లినా కెమెరా (camera)లు గ‌మ‌నిస్తూనే ఉంటాయి. ప్ర‌తీ రోజు అంద‌రూ ఎన్నో కెమెరాల్లో బంధీ అవుతుంటారు. శాంతి భ‌ద్ర‌త‌ల పర్య‌వేక్ష‌ణలో ఈ కెమెరాలు ఎంతో ప్రాముఖ్య‌త వ‌హిస్తున్నాయి. బహిరంగ ప్ర‌దేశాల్లో, షాపుల్లో (shops) సెక్యూరిటీ (security)కోసం ఏర్పాటు చేసే సీసీ కెమెరాలు చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటున్నాయి. అయితే కొన్ని సార్లు ప్రైవేట్ (privet) ప్ర‌దేశాల్లో కూడా కెమెరాలు ఉండ‌టం కొంత ఇబ్బంది పెడుతోంది. అంటే హోటల్ గ‌దుల్లో, దుస్తులు మార్చుకునే ప్ర‌దేశాల్లో కొంద‌రు ఆక‌తాయిలు కావాల‌నే కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నారు. త‌రువాత ఆ వీడియోల‌తో వారిని బ్లాక్ మెయిల్ (blackmail)చేసి డ‌బ్బులు లాగుతున్నారు. ఇలాంటి ఘ‌ట‌నలు వెలుగులోకి వ‌చ్చిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి. మ‌రి కొంద‌రు ఆ వీడియోల‌ను అశ్లీల వెబ్ సైట్ (adult websites) ల‌లో అప్ లోడ్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. హైద‌రాబాద్ (hyderbad) కు చెందిన ఓ జంట‌కు ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది. 

ఓ జంట స‌ర‌దాగా హోటల్ (hotel)లో రూం తీసుకొని ఏకాంతంగా గ‌డిపారు. త‌రువాత అక్క‌డి నుంచి వెళ్లి పోయారు. కొంత కాలం త‌రువాత ఆ యువ‌కుడు నెట్ (internet) లో బ్రౌజ్ (browse) చేస్తుంటే త‌న గ‌ర్ల్ ఫ్రెండ్ (girl friend)తో ఏకాంతంగా రూమ్ లో గ‌డిపిన వీడియో అందులో క‌నిపించింది. దీంతో అత‌డు షాక్ కి గుర‌య్యాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. అస‌లు ఆ వీడియో ఎలా బ‌య‌ట‌కు వ‌చ్చిందో అర్థం కాలేదు. 

కొంత కాలం క్రితం హోట‌ల్ రూమ్ లో గ‌డిపిన స‌మ‌యంలో ఎవ‌రో ఆక‌తాయిలు వారికి తెలియ‌కుండా కెమెరాలు పెట్టి రికార్డు చేశారు. వాటిని వివిధ అశ్లీల వెబ్ సైట్స్ లో అప్ లోడ్ చేశారు. పోయిన నెల 21వ తేదీన ఆ వీడియోను యువ‌కుడు గ‌మ‌నించాడు. దీంతో అత‌డు సైబ‌ర్ క్రైం పోలీసుల‌ను (cyber crime police) ఆశ్ర‌యించాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసి వీడియోను డిలీట్ చేయాల్సిందిగా అభ్య‌ర్థించాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసుకున్నారు. అనంత‌రం హోటల్ సిబ్బందిని పోలీసులు ప్ర‌శ్నించారు. కేసు దర్యాప్తులో ఉంది.