Asianet News TeluguAsianet News Telugu

కెఎ పాల్ మెడ చుట్టూ ఉచ్చు: మోసం చేశాడంటూ మహిళ ఫిర్యాదు


కేఏ పాల్ తన అసిస్టెంట్ జ్యోతి అనే యువతి పేరుతో చెక్ ఇవ్వాలని కోరారని అందుకు తాను రూ.2లక్షల చెక్ ను ఇచ్చానని తెలిపారు. చెక్ ను క్యాష్ చేసుకున్న తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారని, పట్టించుకోవడం లేదని దాంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 
 

A woman compailns against KA paul in police station
Author
Hyderabad, First Published May 28, 2019, 4:41 PM IST

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ క్రైస్తవమత ప్రబోధకుడు కేఏ పాల్ పై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.  కేఏ పాల్ అమెరికా పంపిస్తానంటూ తన దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ సత్యవతి అనే మహిళ కేఏ పాల్ పై ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్ లోని బీహెచ్ఈఎల్ కు చెందిన వ్యాపార వేత్త సత్యవతి అనే మహిళను అమెరికా పంపిస్తానంటూ రెండు లక్షల రూపాయల చెక్ ను కూడా తీసుకున్నట్లు తెలిపింది. చెక్ తీసుకున్న తర్వాత తనకు స్పాన్సర్ షిప్ లెటర్, ఇన్విటేషన్  కార్డు ఇచ్చారంటూ పోలీసులకు ఆధారాలు చూపించింది. 

కేఏ పాల్ పై సత్యవతి ఆరోపణలు ఇలా ఉన్నాయి. వీసా కోసం రెండు లక్షలు తీసుకున్న కేఏ పాల్ తనను అమెరికా పంపించడం లేదని ఆమె వాపోయింది. రూ.రెండు లక్షల రూపాయలు చెక్ ను క్యాష్ చేసుకున్నంత వరకు కేఏ పాల్ వ్యాపారవేత్త సత్యవతితో మాట్లాడిన కేఏ పాల్ డ్రా చేసుకున్న అనంతరం ఆమె నంబర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టేశారు. 

చివరికి కేఏ పాల్ ను పట్టుకున్న ఆమె తనను అమెరికా ఎందుకు పంపించడం లేదని నిలదీసింది. తనకు ఐదు లక్షలు ఇస్తే వీసా ఇప్పిస్తానని లేకపోతే అంతేనని చెప్పుకొచ్చారు. అయితే బ్రతిమిలాడితే రూ.2లక్షలకు ఒప్పందం కుదిరిందని సత్యవతి తెలిపారు. 

చెల్లించిన తర్వాత కూడా వీసా పంపకపోవడంతో ఆమె కేఏ పాల్ ను నిలదీశారు. అయినా కేఏ పాల్ రూ.15లక్షలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారని అనంతరం పట్టించుకోవడం మానేశారని ఆమె వాపోయింది. 

కేఏ పాల్ తన అసిస్టెంట్ జ్యోతి అనే యువతి పేరుతో చెక్ ఇవ్వాలని కోరారని అందుకు తాను రూ.2లక్షల చెక్ ను ఇచ్చానని తెలిపారు. చెక్ ను క్యాష్ చేసుకున్న తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారని, పట్టించుకోవడం లేదని దాంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 

దీంతో తనకు న్యాయం చేయాలంటూ వ్యాపారవేత్త సత్యవతి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. సత్యవతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 420,406, రెడ్ విత్ 30 కింద క్రిమినల్ కేసులను నమోదు. తనలాగే కేఏ పాల్ ఎంతమందిని మోసం చేశారో చెప్పాలని సత్యవతి డిమాండ్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios