Asianet News TeluguAsianet News Telugu

7 ఏళ్ల ఆయూష్ ఆచూకీ దొరికింది: కిడ్నాపర్ అరెస్ట్

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సోమవారం నాడు బిస్కట్లు ఇప్పిస్తామని ఆయూష్ అనే ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు.మరోకరికి బాలుడిని విక్రయించేందుకు  నిందితురాలు ప్రయత్నిస్తున్న సమయంలో  ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా గోపాలపురం పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. 

A Woman arrested for kidnapping seven year old boy in Mahaboobnagar district
Author
Hyderabad, First Published Aug 21, 2018, 11:18 AM IST


హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో సోమవారం నాడు బిస్కట్లు ఇప్పిస్తామని ఆయూష్ అనే ఏడేళ్ల బాలుడిని కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు.మరోకరికి బాలుడిని విక్రయించేందుకు  నిందితురాలు ప్రయత్నిస్తున్న సమయంలో  ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా గోపాలపురం పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారు. 24 గంటల్లోపుగా ఈ కేసును పోలీసులు చేధించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో  సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఆయూష్ అనే ఏడేళ్ల బాలుడితో అతడి తల్లి  కాన్పూర్ వెళ్లేందుకు  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ ఒకటో నెంబర్ ప్లాట్‌ఫారమ్ వద్ద నిల్చుంది. 

అయితే ఆ సమయంలో ఇద్దరు మహిళలు వచ్చి  ఆయూష్‌కు బిస్కట్లు ఇప్పిస్తామని చెప్పి  తీసుకెళ్లారు. అయితే ఎంతకు బాలుడు రాకపోవడంతో కిడ్నాప్‌కు గురైనట్టుగా బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింద.ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు  దర్యాప్తును ప్రారంభించారు. సీసీటీవి పుటేజీలో ఇద్దరు మహిళలు బాలుడిని తీసుకెళ్తున్నట్టుగా గుర్తించారు.

ఈ బాలుడి ఆచూకీని తెలుసుకొనేందుకుగాను పోలీసులు 8 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టాయి. అయితే మహాబూబ్ నగర్ జిల్లాలోని గోపాలపురం పోలీసులు మంగళవారం నాడు ఉదయం నిందితులను అరెస్ట్ చేశారు.  గోపాలపురం సమీపంలో బాలుడిని విక్రయించేందుకు  నిందితులు ప్రయత్నం చేస్తున్న విషయాన్ని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు ఇవాళ సాయంత్రం మీడియాకు వివరించనున్నారు.

ఈ వార్త చదవండి

షాక్: తల్లిని నమ్మించి 7 ఏళ్ల ఆయూష్‌ను కిడ్నాప్ చేసిన ఇద్దరు మహిళలు


 

Follow Us:
Download App:
  • android
  • ios