బిస్కట్లు ఇస్తామని ఏడేళ్ల బాలుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని  ఆయూష్‌గా గుర్తించారు.

హైదరాబాద్: బిస్కట్లు ఇస్తామని ఏడేళ్ల బాలుడిని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుండి ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేశారు. కిడ్నాప్‌కు గురైన బాలుడిని ఆయూష్‌గా గుర్తించారు.

కాన్పూర్‌ వెళ్లేందుకు ఓ మహిళ తన ఏడేళ్ల కొడుకుతో బాలుడిని తీసుకొని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లోని నెంబర్ 1 ఫ్లాట్‌ఫామ్‌‌లో ఉంది.

అయితే ఆ సమయంలో ఇద్దరు మహిళలు వచ్చి బాలుడికి బిస్కట్లు ఇప్పిస్తామని తల్లికి చెప్పి ఆ బాలుడికి తీసుకెళ్లారు. క్షణంలో ఆ బాలుడితో పాటు ఇద్దరు మహిళలు కన్పించకుండాపోయారు.

అయితే బిస్కట్ల కోసం వెళ్లిన తన కొడుకు కూడ కన్పించకపోయేసరికి ఆ బాలుడి తండ్రి ఆందోళన చెందింది. వెంటనే పోలీసలుకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీపుటేజీని పరిశీలించారు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఇద్దరు మహిళలు ఆ బాలుడిని తీసుకొని వెళ్లినట్టు గుర్తించారు. ఆ ఇద్దరు మహిళలు ఎవరనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. తనకు ఎవరిపై కూడ అనుమానం లేదని బాలుడి తల్లి చెబుతోంది.