Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో ఒకే రోజు ఐదుగురు మ‌హిళ‌ల నుంచి గోల్డ్ చైన్స్ లాక్కెళ్లిన దొంగ

హైదరాబాద్ లో దొంగల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. బుధవారం ఒక్క రోజే పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఐదురుగు మహిళల మెడల్లో నుంచి బంగారం లాక్కెళ్లాడు ఓ దొంగ. ఈ క్రమంలో ఓ మహిళ  కింద పడి గాయాలు అయ్యాయి. 

A thief who locks up gold chains from only five women a day in Hyderabad
Author
Hyderabad, First Published Jan 20, 2022, 9:31 AM IST

హైద‌రాబాద్ (hyderabad) న‌గ‌రంలో దొంగ‌లు రెచ్చిపోతున్నారు. రోడ్డు మీద వెళ్తున్న మ‌హిళ‌ల మెడ‌లోని బంగారం దోచుకెళ్ల‌డ‌మే ల‌క్ష్యంగా ప‌ని చేస్తున్నారు. నిన్న ఒక్క రోజే ఒకే దొంగ ఏకంగా ఐదుగురు నుంచి గోల్డ్ చైన్లు (gold chains) లాక్కెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ ప‌రిధిలోని మూడు పోలీస్ క‌మిష‌న‌రేట్ (police commissionaretes) ల ప‌రిధిలో జ‌రిగింది.  ప్ర‌స్తుతం ఆ దొంగ పరారీలో ఉన్నాడు. 

ఈ చైన్ స్నాచింగ్ (chain snaching) ఘ‌ట‌నలో పోలీసులు వివ‌రాలు వెళ్ల‌డించారు. వారు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. బుధ‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ఓ స్నాచ‌ర్ (snachar) దొంగ‌త‌నం మొద‌లు పెట్టి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు దానిని కొన‌సాగించాడు. ఈ స‌మ‌యంలో ఐదుగురి మెడ‌ల్లోంచి బంగారు గొలుసులు లాక్కెళ్లాడు. ఆరో సారి కూడా  ప్ర‌య‌త్నించినా.. అందులో విఫ‌ల‌మ‌య్యాడు. గుర్తు తెలియ‌ని ఆ దొంగ మొద‌ట దొంగ‌లించిన బైక్ తో  మారేడుపల్లి (maredupalli) తుకారాంగేట్‌ (thukarmgate), పేటబషీర్‌బాద్‌ (petabasherbad), మేడిపల్లిలో (medipalli)ప్రాంతాల్లో దొంగ‌త‌నం చేశాడు. ఈ స‌మ‌యంలో అత‌డు క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. 

సంజీవ‌య్య న‌గ‌ర్ (sanjeevaiah nagar) ప్రాంతానికి యాభై ఐదేళ్ల విజయ తన కూతురిని కలవడానికి సమీపంలోని నర్సింగ్ హోమ్‌కి (nusing home) వెళ్ళింది. ఇంటికి తిరిగి న‌డుచుకుంటూ వ‌స్తున్న క్ర‌మంలో ఇంద్రపురి రైల్వే కాలనీ వద్ద కు చేరుకోగానే.. బైక్ (bike) ఓ వ‌చ్చిన ఓ దొంగ ఆమె మెడ‌లో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు.   చైన్ లాక్కొనే స‌మ‌యంలో విజ‌య కింద‌ప‌డిపోయారు. దీంతో ఆమెకు గాయాల‌య్యాయ‌ని మారేడుపల్లి ఇన్‌స్పెక్టర్‌ ఎం మత్తయ్య తెలిపారు.

మారెడుప‌ల్లిలో దొంగ‌త‌నం చేసిన అనంత‌రం నిందితుడు పక్కనే ఉన్న తుకారాంగేట్ (thukaram gate) పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించారు. ఈ సారి అతను 65 ఏళ్ల రాంబాయిని ల‌క్ష్యంగా చేసుకున్నారు. ఆమె రోడ్డు ప‌క్క‌న న‌డుస్తున్న స‌మ‌యంలో ఎదురుగా బైక్ పై వ‌చ్చిన దొంగ మ‌హిళ మెడ‌లో నుంచి వచ్చి 2.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. అనంత‌రం అక్క‌డి నుంచి సైబరాబాద్‌లోకి ప్రవేశించి రెండు స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు.మ‌రో గంట‌లోనే ఇంకో దొంగ‌త‌నం చేయ‌డానికి ప్ర‌య‌త్నించినా.. అది విఫ‌ల‌మైంది.ఈమేరకు తుకారాంగేట్, మారేడుపల్లిలో పోలీసులు విచారణ ప్రారంభించారు. 

పోలీసులు (police)విచార‌ణ చేప‌ట్టి ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరా (cctv) ఫుటేజ్ ల‌ను ప‌రిశీలించారు. ఈ దొంగ‌త‌నాలకు నిందితుడు ఒకే బైక్ ను ఉప‌యోగించిన‌ట్టు నిర్దారించుకున్నారు. అయితే ఈ వెహికిల్ (vehicel) నెంబ‌ర్ ఉప‌యోగించి బైక్ య‌జ‌మాని ఎవ‌రనేది తెలుసుకున్నారు. అయితే ఆ బైక్ ఆసిఫ్ నగర్‌లో (asifnagar) చోరీకి గురైంద‌ని తెలుసుకున్నారు. బైక్ య‌జ‌మాని ఓ దుకాణానికి వెళ్తూ కీ ల‌ను ఇగ్నిష‌న్ లోనే ఉంచాడు. దీనిని గ‌మ‌నించిన దొంగ ఆ బైక్ ను తీసుకొని ప‌రారయ్యాడు. బంగారం పోగొట్టుకున్న బాధితుల్లో పేట్‌బషీరాబాద్‌లోని రాఘవేంద్ర కాలనీ (shetbhasheerbad ragavendra  colony) , జీడిమెట్ల (jeedimetla) ప్రాంతానికి చెందిన అనురాధ, వరలక్ష్మి ఉన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios