Asianet News TeluguAsianet News Telugu

వీడిన మిస్టరీ : సెల్ ఫోన్ కోసం.. స్నేహితుడిని చంపి, కిరోసిన్ పోసి తగలబెట్టి...

ఉప్పల్, శిల్పారామం వద్ద కాలినమృతదేహం మిస్టరీ వీడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో ఇది హత్యగా తేలింది. ఈ కేసులో నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి టూ వీలర్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

A Suspicious death has been confirmed as Murder by Uppal Police, 4 Arrested - bsb
Author
Hyderabad, First Published Jun 30, 2021, 5:16 PM IST

ఉప్పల్, శిల్పారామం వద్ద కాలినమృతదేహం మిస్టరీ వీడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసుల దర్యాప్తులో ఇది హత్యగా తేలింది. ఈ కేసులో నిందితులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి టూ వీలర్, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

శిల్పారామం సమీపంలో హెచ్‌ఎండిఎ లేఅవుట్ వద్ద సుమారు 25 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని యువకుడి మృతదేహం కాలిపోయి ఉందన్న సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు 21.06.2021 ఉదయం, శిల్పారామం సమీపంలోని సంఘటన స్థలానికి చేరుకున్నారు.

అప్పటికే మృతదేహం సగం కాలిపోయి ఉండడంతో గుర్తు పట్టడం కష్టంగా మారింది. అయితే అతని చేతి ఉంగరం, ఎడమ చేతి మీద “బాలూ” “యాదయ్య” “ఓం” చిహ్నం, కుడి చేతి మీద “భవానీ” అని  పచ్చబొట్టు గుర్తులు ఉన్నాయి. దీంతోపాటు మృతదేహం పక్కన ఓ ఖాళీ కిరోసిన్ బాటిల్ దొరికింది. విజయపురి కాలనీ సూపర్వైజర్ ఎం. నరేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

దీనికోసం పై వివరాలతో మిస్సింగ్ కేసులను పరిశీలించారు. చుట్టుపక్కల పిఎస్, కమీషనరేట్స్,ఇతర జిల్లాల్లో లుక్ అవుట్ నోటీసులు పంపారు. ఈ క్రమంలో బాలానగర్ పీఎస్ లో బాలరాజు అనే వ్యక్తి తప్పిపోయినట్టు మిస్సింగ్ కేసు నమోదయ్యింది. 

ఈ గుర్తులతో ఉండే ఆ వ్యక్తి కిరణా షాపులో పనిచేస్తాడు. జూన్ 20న సాయంత్రం ఐదింటికి తన స్నేహితులతో కలిసి వెళ్లిన బాలరాజు... ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాలేదని తెలిసింది. బాలరాజు స్నేహితులు, ఫోన్ కాల్స్ ఆధారంగా హత్యకేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

ప్రధాన నిందితుడు వాద్యవత్ మహేష్ (ఎ -1), చనిపోయిన బలరాజుకు ఆరేళ్లుగా పరిచయం ఉంది. జూన్ 20 మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాన నిందితుడు మహేష్ (ఎ -1) తో పాటు అతని స్నేహితులు నాగరాజు, సాయిలు సనత్ నగర్, జింకలబావి దగ్గరున్న కల్లు కాంపౌండ్ లో మద్యం తాగుతుండగా.. బాలరాజు అక్కడికి వెళ్లారు. వీరంతా కలిసి మద్యం సేవించారు.

 ఆ తరువాత సాయంత్రం 4 .30 గంటలకు వారంతా కలిసి మషేష్ ను అక్కడే వదిలేసి.. బాలరాజును దింపడానికి ఆటోలో ఐడీపిఎల్ బయల్దేరారు. అయితే కాసేపటికే మహేష్ తన ఫోన్ కనిపించడంలేదని గుర్తించాడు. వెంటనే అతను బాలరాజు మీద అనుమానంతో అతని ఇంటికి వచ్చాడు. 

ఫోన్ గురించి ఆరా తీస్తే తనకేమీ తెలియదని చెప్పాడు. ఆ తరువాత ఫోన్ కోసం మహేష్ స్నేహితులు నాగరాజు, సాయి చిలుకానగర్ లో ఉన్న మహేష్ ఇంటికి వచ్చారు. అక్కడ మరోసారి బాలరాజును అడిగితే తను తీయలేదని చెప్పాడు. దీంతో నాగరాజు మహేష్ బాలరాజును కొట్టారు. 

కొట్టడంతో బాలరాజు ఫోన్ తానే తీశానని కిరాణాషాపు ఓనర్ దేవేందర్ కు ఇచ్చానని ఒప్పుకున్నాడు. ఇది చెప్పేటప్పుడు నాగరాజు వీడియో తీశాడు. ఆ తరువాత దేవేందర్ కి ఫోన్ చేసి ఫోన్ ఇవ్వమని అడిగితే.. తనకు ఏ ఫోనూ తెలియదని తెలిపాడు. దీంతో మహేష్ తన సోదరుడు సుధీర్‌ను పిలిచాడు. రాత్రి 9 గంటలకు నాగరాజు, సాయి నిందితుల ఇంటి నుండి బయలుదేరారు.

సుమారు 10.30 గంటలకు మహేష్ అతని అన్ననరేష్, తమ్ముడు సుధీర్ లు మహేష్ ఇంట్లో కలుసుకున్నారు. బాగా మద్యం సేవించారు. ఆ తరువాత ఫోన్ ఎక్కడ అంటూ బాలరాజును విపరీతంగా కొట్టారు. దెబ్బలకు అతను చనిపోవడంతో.. ఆ మృతదేహాన్ని మహేష్ అద్దెకు తీసుకున్న ఆటోలో మహేష్, అతని భార్య విజయ, అన్నయ్య నరేష్, మృతదేహంతో పాటు బయల్దేరారు. 

తమ్ముడు సుధీర్ తన బైక్ మీద కిరోసిన్ తీసుకుని వచ్చాడు. సుధీర్ బైక్ మీద నాగోల్ వద్ద కాపలా ఉన్నాడు. మిగిలిన నిందితులు హెచ్ఎండిఎ లేఅవుట్లోకి వెళ్లి కిరోసిన్ పోసి మృతదేహాన్ని తగలబెట్టారు. తరువాత ఎ -1 నుంచి ఎ -4 వరకు నిందితులందరూ బండ్లగూడ ఆనంద్ నగర్ లోని తమ సోదరి శాంతి ఇంటికి వెళ్లారు. వీరికి వారి బావమరిది రవి ఆశ్రయం ఇచ్చాడు. 

నిందితుడు మహేష్ కు నేరచరిత్ర ఉందని దర్యప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. వీరి దగ్గర హత్యకు ఉపయోగించిన ఆటో, టూ వీలర్ దొరకలేదు. కానీ వీరినుంచి మూడు సెల్ ఫోన్లు, కిరోసిన్ డబ్బా స్వాధీనం చేసుకున్నారు. 

అనుమానాస్పద మరణంకేసులో, ఆధారాలు లేనప్పటికీ, ఐటి సెల్, ఎస్ఓటి సహాయంతో కేసును గుర్తించడానికి ప్రయత్నాలు జరిగాయి, మహేష్ ఎం. భగవత్, ఐపిఎస్, ఎడిజిపి, పోలీసు కమిషనర్, రాచకొండ, జి.సుధీర్ బాబు, ఐపిఎస్, అదనపు పోలీసు కమిషనర్, రాచకొండ, డి.శ్రీనివాస్, ఐ / సి డిసిపి, మల్కాజ్గిరి జోన్, ఎన్. ఎం. శ్రీధర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ ఐటి సెల్, అతని బృందం,  జి. నవీన్, ఇన్స్పెక్టర్ ఎస్ఓటి మల్కాజ్గిరి, అతని బృందం,  ఆర్. జయరామ్, ఎస్ఐ ఆఫ్ పోలీస్,  కె. మైబెల్లీ, ఎస్ఐపి, కుమ్. జె. నిందితులను గౌరవ కోర్టులో హాజరుపరుస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios