ఆదిలాబాద్ లో కాంగ్రెస్ కు భారీ ఎదురుదెబ్బ.. మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసిన ముఖ్య నాయకులు.. ఎందుకంటే ?

ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మరో ముఖ్యనేత సంజీవ రెడ్డి, వారి అనుచరులు పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా చేశారు.

A shock to the Congress in Adilabad.. Major leaders resigned from the party en masse.. because?..ISR

ఆదిలాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేశారు. ఇందులో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ మంత్రి, దివంగత నేత సి.రాంచంద్రారెడ్డి మేనళ్లుడు సంజీవరెడ్డితో పాటు పలువురు నాయకులు కూడా ఉన్నారు. తామూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆ నాయకులంతా సోమవారం వెల్లడించారు. 

ఈ మేరకు దివంగత నాయకుడు రాంచంద్రారెడ్డి ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు తమ పదవులు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. పార్టీలోకి ఇటీవల వచ్చిన కంది శ్రీనివాస్ రెడ్డికి టిక్కెట్టు ఇచ్చి, ఇక్కడి సీనియర్ నాయకులను పక్కన పెట్టడంపై హైకమాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా సంజీవరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ, పార్టీకి సేవలు చేస్తున్న తమకు పార్టీలో ప్రధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల సూచన మేరకు తాను ఈ నెల 10వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే బరిలో నిలిచేందుకు నామినేషన్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు. 

కాగా.. కాంగ్రెస్ పార్టీ నుంచి గత ఎన్నికల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న గండ్రత్ సుజాతకు టిక్కెట్ దక్కింది. ఆమె ఆ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కూడా తనకు టిక్కెట్ దక్కుతుందని ఆమె ఆశతో ఉన్నారు. అయితే ఇటీవల బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎన్ఆర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డికి హైకమాండ్ టిక్కెట్ కేటాయించింది. దీంతో అప్పటి నుంచి సీనియర్ నాయకులంతా పార్టీపై గుర్రుగా ఉన్నారు. 

వాస్తవానికి కంది శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరినప్పటి నుంచి సీనియర్ల నుంచి వ్యతిరేకత వస్తోంది. పార్టీ సీనియర్ నేత వి.హన్మంత్ రావు (వీహెచ్) సమక్షంలోనే ఇరు వర్గాలకు ఘర్షణ జరిగింది. కంది వర్గంపై ఆ సమయంలో హన్మంత్ రావు ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. కానీ జిల్లాలో అనతి కాలంలోనే మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకోవడం, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతో ఆయనకు పార్టీ టిక్కెట్ కేటాయించిందని స్థానికంగా చర్చ జరుగుతోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios