ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడుతోంది. రోజుకో ప్రమాదం జరుగుతూ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. నిన్న సినీ నటుడు భరత్ మరణించి 24 గంటలు గడవకముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఓ మహిళ మృతి చెందింది.
ఔటర్ రింగ్ రోడ్డు రక్తమోడుతోంది. రోజుకో ప్రమాదం జరుగుతూ అత్యంత ప్రమాదకరంగా మారుతోంది. నిన్న సినీ నటుడు భరత్ మరణించి 24 గంటలు గడవకముందే తాజాగా మరో ప్రమాదం జరిగింది. ఓ మహిళ మృతి చెందింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని హమిదుల్లానగర్ ఔటర్ రింగు రోడ్డు పై కారు బీభత్సం సృష్టించింది. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళలపైకి గుర్తు తెలియని కారు దూసుకెళ్లింది.
దీంతో దేవి అనే మహిళ మృతి చెందారు. మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను హాస్పిటల్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తలియాల్సి ఉంది.