సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఓ వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఫుత్ పాత్ పై నిలబడి ఉన్న వ్యక్తి ఓ పెద్ద ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించుకున్నాడు. ఈ వీడియో మంత్రి రీ ట్వీట్ చేశారు.
రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ట్రక్ మీదికి దూసుకొచ్చినా అదృష్టవశాత్తూ తృటిలో ఓ యువకుడు తప్పించుకొని ప్రాణాలు నిలుపుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు. ఇది ఇప్పటి వరకు 4 మిలియన్లకు పైగా వ్యూవ్స్ ను సొంతం చేసుకుంది.
ఆన్ లైన్ లో వైరల్ గా మారిన ఈ వీడియోలో ఏముందంటే.. ఓ వ్యక్తి ఫుత్ పాత్‌పై నిలబడి తన దగ్గర ఉన్నకొన్నిపేపర్లలో ఏదో వెతుకుతున్నాడు. అయితే అదే సమయంలో ఓ ట్రక్కు వేగంగా పక్కన ఉన్న రోడ్డుపై వస్తోంది. అయితే ఆ రోడ్డుపక్కన చెట్టు కొమ్మలకు ఈ ట్రక్ వేగంగా తగలుతుంది. దీంతో అది బ్యాలెన్స్ తప్పి ఆ వ్యక్తిపైకి దూసుకుకెళ్లింది. అయితే అతడు అదృష్టవశాత్తు ట్రక్కు, గేటుకు మధ్య ఇరుక్కుపోయాడు. తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. అక్కడి నుంచి వెంటనే పారిపోయాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. ఈ వీడియోను షేర్ చేస్తూ ‘‘జీవితం చాలా అనూహ్యమైనది!’’ అని క్యాప్షన్ పెట్టారు.
ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కొందరు అతడిని అదృష్టవంతుడిగా పేర్కొన్నారు. మరో ట్విట్టర్ యూజర్ ‘‘ ఓహ్, ఆయన తన జీవిత కథను చెప్పడానికి సురక్షితంగా ఉన్నాడు‘‘ అని రాశారు. మరో యూజర్ ‘‘ఆయన ఎంత అదృష్టవంతుడు’’ అని కామెంట్ చేశారు.
ఈ భయంకరమైన వీడియోపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. ఆ వీడియోను రీట్వీట్ చేస్తూ ‘‘ ఓ డార్న్! అతడు ఎలా బ్రతికాడు?’’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియోపై వైరల్ గా మారడంతో ఎంతో మంది దీనిని షేర్ చేస్తున్నారు.
