ఎవరూ చేయకూడని పనిచేసిన పాలమూరు నేత కాపు కాసి పట్టుకుని చితకబాదిన జనాలు
పాలమూరు జిల్లాలో ఒక రాజకీయ నేతకు తన ప్రత్యర్థితోపుట మరికొందరు కలిసి దేహశుద్ధి చేశారు. ఎందుకలా దేహశుద్ధి చేయాల్సి వచ్చింది? అసలు ఆ పాలమూరు రాజకీయ నేత ఏం చేశాడో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. స్థానికులు చెబుతున్న వివరాలిలా ఉన్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఒక పార్టీ నాయకుడికి స్థానికులు దేహశుద్ది చేశారు. రామచంద్రారెడ్డి అనే ఆయన ఒక జతీయ పార్టీకి సీనియర్ నాయకుడు. జడ్చర్ల పట్టణంలోని పోలీసు స్టేషన్ సమీపంలో కేశవర్దవ్ రెడ్డి అనే వ్యక్తికి చెందిన ఇంటిని కబ్జా చేసేందుకు రామచంద్రారెడ్డి గత కొన్ని సంవత్సరాలుగా యత్నిస్తున్నాడు. ఆ ఇంటిని తనకే అమ్మాలని పలు మార్లు వత్తిడి తీసుకొస్తున్నాడు.

అందుకు ఒప్పుకోకపోవడంతో తన నీచ బుద్దిని బయటపెట్టాడు. గత వారం రోజులుగా అర్దరాత్రి సమయంలో వీది లైట్లు బంద్ చేసి ఆ ఇంటి ముందు మల మూత్ర విసర్జనలను చేస్తున్నాడు. దీన్ని గమనించిన ఇంటి యజమాని మరికొందరు స్థానికులు కలిసి రాత్రి కాపు కాసి ఆ కాంగ్రేస్ నాయకుడి భరతం పట్టారు. చెట్టుకు కట్టేసి చితక బాదారు. అయితే మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
