తనకు న్యాయం చేయాలని అడిగిన పాపానికి ఆ వృద్ధురాలిపై అమానుషంగా దాడి చేశారు. ఇంట్లోకి వచ్చి ఒంటిపై గాయాలయ్యేలా చితకబాదారు. పండ్లు కూడా విరగ్గొట్టారు. కోర్టు కేసులు వాపసు తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధురాలు ప్రస్తుతం  యశోద ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

తనకు న్యాయం చేయాలని అడిగిన పాపానికి ఆ వృద్ధురాలిపై అమానుషంగా దాడి చేశారు. ఇంట్లోకి వచ్చి ఒంటిపై గాయాలయ్యేలా చితకబాదారు. పండ్లు కూడా విరగ్గొట్టారు. కోర్టు కేసులు వాపసు తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధురాలు ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

బాధితురాలి కుటుంబ సభ్యులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘట్ లో వి. కౌసల్యాదేవి అనే వృద్ధురాలు నివసిస్తోంది. 36 ఏళ్ళ క్రితం ఆమెను వల్లభాపురపు మోహన్ ప్రసాద్ అనే వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తర్వాత వారికి అబ్బాయి పుట్టాడు. కొడుకు సంతోష్ ప్రసాద్ పుట్టిన కొద్దిరోజులకే మోహన్ ప్రసాద్ అమెరికా వెళ్లిపోయాడు. కొడుకుకు ఐదేళ్ల వయసు వచ్చే వరకు అమెరికా నుంచి ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపాడు మోహన్ ప్రసాద్. కానీ ఆ తర్వాత ఇక మాయమైపోయాడు. తర్వాత ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ దొరకలేదు.

భర్త ఆచూకీ లేకపోవడంతో కౌసల్యాదేవి ప్రయివేటు పాఠశాలలో హిందీ టీచర్ గా పనిచేస్తూ జీవిస్తున్నారు. కాలం మార్పులు తెచ్చింది. కౌసల్యాదేవి కొడుకు ప్రస్తుతం 35 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఆయన ఆటో నడుపుతూ జీవిస్తున్నాడు. ఆయన భార్య ప్రయివేటు ఉద్యోగం చేస్తోంది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కౌసల్యాదేవి తన భర్త గురించి ఏ వివరాలు కూడా తన కొడుకుకు చెప్పలేదు. కానీ తన తండ్రి గురించి బయటి వ్యక్తుల ద్వారా తెలుసుకున్నాడు సంతోష్ ప్రసాద్. గడ్డి అన్నారంలో తన తండ్రికి ఇల్లు ఉందని, ఆయన అమెరికాలో ఉంటూ అప్పుడప్పుడు హైదరాబాద్ వచ్చిపోతున్నట్లు సమాచారం సేకరించాడు.

తన తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్లు తెలుసుకున్నాడు. ఒకసారి గడ్డి అన్నారంలోని తన తండ్రి ఇంటికి వెళ్తే అక్కడి వారు గుర్తు పట్టనట్లు నటించి వెళ్లగొట్టినట్లు చెప్పాడు. తర్వాత తల్లిని అడిగితే తండ్రి గురించి పూర్తి సమాచారం కొడుకుకు చెప్పింది. దీంతో తన తల్లికి న్యాయం జరిగే వరకు పోరాడాలని నిర్ణయించున్నాడు. తన తల్లికి జరిగిన అన్యాయంపై చాదర్ ఘట్ పోలీసు స్టేషన్ లో కేసు పెట్టాలని వెళ్తే పోలీసులు స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించారు ఆ తల్లీ కొడుకులు.

ఇక కోర్టులో తనకు న్యాయం చేయాలని కౌసల్యాదేవి కేసు వేసింది. తన భర్త నుంచి తనకు నష్టపరిహారం చెల్లించాలని కోరింది. మరోవైపు అమెరికాలో స్థిరపడిన సదరు వ్యక్తి అక్కడ మరో పెళ్లి చేసుకోగా ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అమెరికా భార్యతో మోహన్ ప్రసాద్ విడాకులు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఆయన స్పోర్ట్స్ ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా జూన్ 21వ తేదీన కౌసల్యాదేవి ఇంటికి ఒక వ్యక్తి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో తలుపులు బిగించి కౌలస్యాదేవిపై దాడి చేశాడు. ఆమె ఒంటిపై తీవ్రంగా గాయాలయ్యేటట్టు కొట్టిండు. మూతి పండ్లు కూడా విరిగిపోయేలా గాయాలపాలు చేసి వెళ్లిపోయాడు. విషయం తెలుసుని చుట్టుముట్టు వాళ్లు యశోద ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

కౌసల్యాదేవి కొడుకైన సంతోష్ ప్రసాద్ కు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బాధితుడు చెబుతున్నాడు. కేసు వాపస్ తీసుకోకపోతే చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని అంటున్నారు. తమపై దాడిచేసిన వారిని గుర్తించి శిక్షించడంతోపాటు తమకు జరిగిన అన్యాయాన్ని సరిచేయాలని కోరుతున్నారు.

మరీ పోలీసు ఉన్నతాధికారులు కౌసల్యాదేవిని మోసం చేసిన తన భర్త ఎన్నారై మోహన్ ప్రసాద్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుని పేదరికంలో మగ్గిపోతున్న ఆమెకు, ఆమె కొడుకు కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది.