లాక్‌డౌన్ దెబ్బ: కోటిన్నర లీటర్ల బీర్లు ఇక డ్రైనేజీ పాలేనా....

 లాక్‌డౌన్ కారణంగా మద్యం ప్రియులకు మద్యం దొరకడం లేదు. మద్యం దుకాణాలు, ఎక్సైజ్ డిపోలు, బార్లలో నిల్వ ఉన్న కొన్ని బీర్లు గడువు దాటి పోనుంది. 

A million and a half liters of beer is out of date in telangana

హైదరాబాద్: లాక్‌డౌన్ కారణంగా మద్యం ప్రియులకు మద్యం దొరకడం లేదు. మద్యం దుకాణాలు, ఎక్సైజ్ డిపోలు, బార్లలో నిల్వ ఉన్న కొన్ని బీర్లు గడువు దాటి పోనుంది. ఈ బీర్లు డ్రైనేజీ పాలు కానున్నాయి. బీరును తయారు చేసిన ఆరు మాసాల్లోనే ఉపయోగించాలి. తెలంగాణ రాష్ట్రంలో సుమారు కోటిన్నర లీటర్ల బీరు గడువు దాటిపోయే అవకాశం ఉంది. దీంతో ఈ బీరంతా మురికి కాలువలో పోయాల్సిందే.

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా మే 3వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం లాక్ డౌన్ ను మే 7వ తేదీ వరకు పొడిగించింది.లాక్‌డౌన్ కారణంగా మద్యం దుకాణాలను మూసివేశారు. 

రాష్ట్రంలో బీర్లు తయారు చేసే బ్రేవరేజీస్ సంస్థలు, ఎక్సైజ్ డిపోలు, వైన్ షాపులు, బార్లలో సుమారు 18 లక్షల నుండి 20 లక్షల కాటన్ల బీర్ల నిల్వ ఉన్నట్టుగా అంచనా. ఇది కోటిన్నర లీటర్లతో సమానంగా చెబుతారు. 

ఒక్కో బీరు కాటన్ లో 12 సీసాలు ఉంటాయి. బీరు సీసాలో 650 మి.లీ బీరు ఉంటుంది. రాష్ట్రంలో గడువు తీరిన బీరును డ్రైనేజీలో పోయాల్సిందేనని ఎక్సైజ్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. బీరు తయారు చేసిన ఆరు మాసాల్లోపుగానే వినియోగించాలి. ఆరు మాసాల తర్వాత ఆ బీరును వినియోగించకూడదు.

ఏప్రిల్ లో సాధారణంగా రాష్ట్రంలో 50 లక్షల కాటన్ల బీరు విక్రయాలు జరుగుతాయి. మే మాసంలో కూడ దాదాపుగా అంతే మేరకు విక్రయాలు జరుతుతాయి. వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటే బీరు విక్రయాలు కొంచెం పెరిగే అవకాశం లేకపోలేదని కొందరు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువగా బీర్ల విక్రయాలు జరిగేవి.జీహెచ్ఎంసీ పరిధిలో ఏప్రిల్ మాసంలో సుమారు 25 లక్షల కాటన్ల  బీర్ల విక్రయాలు జరిగేవని గణాంకాలు చెబుతున్నాయి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios