హ్యాట్రిక్ విజయం ఖాయం.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట : హరీశ్ రావు
Hyderabad: వరుసగా మూడోసారి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం సాధించి రాష్ట్రంలో అధికార చేపడతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనీ, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Health Minister T Harish Rao: వరుసగా మూడోసారి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం సాధించి రాష్ట్రంలో అధికార చేపడతుందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందనీ, మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
వివరాల్లోకెళ్తే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నాయకత్వంలో వందకు పైగా సీట్లతో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి బీఆర్ఎస్ కు, కేసీఆర్ కు మద్దతివ్వాలని హరీశ్ రావు ఒక ప్రకటనలో ఓటర్లను కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మరే రాజకీయ పార్టీకి అవకాశం లేదన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే రాష్ట్రం నాశనమవుతుందనీ, బీజేపీకి వేసిన ఓటు వృథా అవుతుందని, ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు దక్కించుకోవడానికి కష్టపడతారని ఆయన అన్నారు.
ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఆవిష్కరించనున్న బీఆర్ఎస్ మేనిఫెస్టో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఓట్లు అడిగే రాజకీయ పర్యాటకుల పట్ల ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. ప్రజల అవసరాలు తీరుస్తూ బీఆర్ఎస్ తన హామీలను నిరంతరం నెరవేరుస్తోందన్నారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకం కావాలనీ, బీఆర్ఎస్ పాలనలో సాధించిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలన్నారు. కాంగ్రెస్ గత పాలన, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రాష్ట్ర ప్రగతికి బీజేపీ అడ్డుపడుతున్నాయని విమర్శించారు. విభజన ప్రతిపక్షాల ప్రచారాలతో పోలిస్తూ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) విశ్వసనీయతను గురించి ప్రస్తావించారు.
కాంగ్రెస్ ఆరు హామీలు కేవలం రాజకీయ ఎత్తుగడలు మాత్రమేననీ, పింఛన్ల చెల్లింపుల్లో ఆ పార్టీ రికార్డు ఏమిటని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఇచ్చిన అసలైన వాగ్దానాలకు, బూటకపు మాటలకు తేడాపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. రాష్ట్రంలో మెరుగైన పాలన అందిస్తున్న బీఆర్ఎస్ కు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు మరోసారి ప్రజలు మద్దతు తెలిపాలని కోరారు.