కూతురి అసభ్య ఫోటోలు,వీడియోలను అమ్ముకున్న కసాయి తండ్రి

A  father selling his daughter photos and videos hyderabad
Highlights

హైదరాబాద్ పోలీసులకు అదుపులో పాకిస్థానీ

 కూతురి ఫోటోలు, వీడియోలు అమ్ముకుని ఆ డబ్బులతో జల్సాలు చేసిన ఓ కసాయి సవతి తండ్రిని భార్య పిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు. అబద్దాలు చెప్పి తనను పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెడుతుంటే కూడా ఇన్నాళ్లు భరించిన ఆ తల్లి, తన కూతురి జోలికి వస్తే మాత్రం ఏ మాత్రం సహించలేక పోయింది. కూతురి వీడియోలు చూపించి బ్లాక్ మెయిల్ చేయాలనుకున్న భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి కటకటాలపాలు చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఉపాధి కోసం దుబాయ్ కి వెళ్లింది. అక్కడ మహమ్మద్ ఇక్రాన్ అనే వ్యక్తి తో పరిచయమైంది. అయితే అతడు తాను పాకిస్థానీ అన్న విషయాన్ని దాచిపెట్టి డిల్లీలో ఉంటానని చెప్పి ఆ మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె పిల్లలకు కూడా అండగా ఉంటానని ననమ్మబలికాడు.

అయితే అతడు పాకిస్థానీ అన్న విషయం తెలిసిన మహిళ అతడితో తెగతెంపులు చేసుకుని హైదరబాద్ కు వచ్చి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో ఇక్రాన్ పాకిస్థాన్ నుండి అక్రమంగా ఇండియాలో ప్రవేశించి హైదరాబాద్ కు చేరుకున్నాడు. ఇక్కడ చాధర్ ఘాట్ లో నివాసముంటూ తరచూ భార్య దగ్గరకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేసేవాడు. ఇవ్వకుంటా తీవ్రంగా కొడుతూ చిత్న హింసలు పెట్టేవాడు. అయినా ఆ మహిళ అతడిని భరిస్తూ వచ్చింది.

అతడు భార్య నుండి డబ్బులు లాగడానికి  నీచమైన పనికి పాల్పడ్డాడు. ఆమె 12 ఏళ్ల కూతురి అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు రహస్యంగా తీసి బయటి వ్యక్తులకు అమ్మి సొమ్ముచేసుకునేవాడు. అంతటితో ఆగకుండా భార్య కు కూడా ఈ వీడియోలు చూపించి డబ్బులివ్వాలని బ్లాక్ మెయిల్ దిగాడు. దీంతో సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. అతడి ఆగడాలు, వీడియోల గురించి వారికి తెలియజేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇక్రాన్ ను అరెస్టు చేసి జైలుకు తరలించారు.
 

 

loader