లిప్ట్ లో ఇరుక్కుని 12 ఏళ్ల బాలుడు మృతి

First Published 25, May 2018, 11:26 AM IST
A 12 year old boy died after getting stuck in a lift in an apartment in Hyderabad
Highlights

హైదరాబాద్ బర్కత్ పురా లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఓ అపార్ట్ మెంట్ లోని లిప్ట్ లో ఇరుక్కుని ఓ చిన్నారి బాలుడు మృతిచెందిన సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. కూలీ పని చేసుకునే తల్లిదండ్రులకు ఆసరాగా ఉందామని 12 ఏళ్ల వయసులోనే ఈ బాలుడు న్యూస్ పేపర్ డెలివరీ బాయ్ గా పనిలో చేరాడు. అయితే విధి వక్రించడంతో తల్లిదండ్రలకు దూరమైపోయాడు. 

ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రమాదానికి గురైన బాలుడు రోజూ మాదిరిగానే పేపర్ వేయడానికి తెల్లవారుజామున బయలుదేరాడు. ఓ అపార్ట్ మెంట్ లోని ప్లాట్ లో పేపర్ వేయడానికి లిప్ట్ లో ఎక్కాడు. అయితే పేపర్ వేసి తిరిగి వచ్చే క్రమంలో లిప్ట్ తలుపుల మద్య ఇరుక్కుని తీవ్ర గాయాలపాలై బాలుడు అత్యంత దారుణంగా మృతి చెందాడు.

మృతి చెందిన బాలుడు స్థానికంగా ఆరో తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో తల్లిదండ్రులకు ఆసరాగా ఉందామని 1000 రూపాయల జీతానికి పేపర్ బాయ్ గా పని చేస్తుతున్నాడు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగి ఇతడు ప్రాణాలు కోల్పోయాడు.

రక్తపుమడుగులో లిప్ట్ మద్యలో ఇరుక్కున బాలున్ని గమనించిన వాచ్ మెన్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  
 

loader