మేడ్చల్‌లో పదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి..

Medchal: తెలంగాణలో కుక్కల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు చిన్నారులను కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా మేడ్చల్ మరో ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి చేసింది. 
 

A 10-year-old boy was attacked by stray dogs at Suraram in Telangana's Medchal RMA

Suraram-stray dogs attack: తెలంగాణలో కుక్కల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు చిన్నారులను కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది కుక్కల దాడిలో గాయపడ్డారు. తాజాగా మేడ్చల్ మరో ఘటన చోటుచేసుకుంది. పదేళ్ల బాలుడిపై వీధి కుక్కల గుంపు దాడి చేసింది. అదృష్టవశాత్తూ  కుక్కదాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. 

వివరాల్లోకెళ్తే. మేడ్చల్‌లోని సూరారం పరిధిలోని శ్రీరామ్‌నగర్‌లో ఓ బాలుడిపై కుక్కల గుంపు దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. వీడియో ఫుటేజీలో, బాలుడు సాయి చరిత్ (10 సంవ‌త్స‌రాలు) తన ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించాడు. అయితే, అటుగా ఒక వీధి కుక్కల గుంపు వ‌చ్చింది. అకస్మాత్తుగా అందులోంచి ఒక కుక్క‌ బాలుడి వైపు పరుగెత్తి అతనిపై దాడి చేసింది.

 

బాలుడిపై క్రూరంగా దాడికి దిగిన కుక్క‌తో పోరాడాడు. అదృష్టవశాత్తూ బాలుడు ఆ స్థలం నుండి తప్పించుకోగలిగాడు. ఇంట్లోకి పరుగెత్తడంతో గాయాల‌తో త‌ప్పించుకోగ‌లిగాడు. ఆదివారం ఉదయం 10:30 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

వీధికుక్కల వల్ల స్థానికులు ఇబ్బందులు పడుతున్నార‌నీ, ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. బాలుడిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించగా, చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయ‌నీ, చికిత్స అందిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios