93ఏళ్ల వయసులోనూ... కరోనాను జయించిన ధీర వనిత
93ఏళ్ల వయసులోనూ కరోనా బారినపడినా కనీసం హాస్పిటల్ కు కూడా వెళ్ళకుండా సురక్షితంగా బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచింది జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు.
జగిత్యాల: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. వైరస్ ప్రభావం, ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు పిట్టల్లా రాలుతున్నారు. ఇక వయసు మీదపడిన వృద్ధులు కరోనాబారిన పడితే బ్రతకడం కష్టమేనని వైద్యనిపుణులే చెబుతున్నారు. అలాంటిది 93ఏళ్ల వయసులోనూ కరోనా బారినపడినా కనీసం హాస్పిటల్ కు కూడా వెళ్ళకుండా సురక్షితంగా బయటపడి అందరినీ ఆశ్చర్యపరిచింది జగిత్యాల జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు.
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని కట్కాపుర్ గ్రామానికి చెందిన 93 ఏళ్ల నరమ్మ ఇటీవలే కరోనా బారినపడ్డారు. అయితే ఆమె ఏమాత్రం ఆందోళనకు గురవకుండా హోం క్వారంటైన్ లోకి వెళ్లింది. వైద్యులు సూచించిన మందులు వాడుతూనే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంది. దీంతో కరోనా నుండి సురక్షితంగా బయటపడింది.
read more తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: ఒక్క రోజులోనే 10 వేలు దాటిన కేసులు, 52 మంది మృతి
ఈ వయసులో కూడా హాస్పిటల్ కు వెళ్లే అవసరం లేకుండానే కరోనాను జయించిన నర్సమ్మ అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా వుండటంతో పాటు తమ సూచనలను తూచ తప్పకుండా పాటించడంవల్లే నర్సమ్మ ఈ వయసులోనూ కరోనాను జయించారని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.