తెలంగాణలో కరోనా డేంజర్ బెల్స్: ఒక్క రోజులోనే 10 వేలు దాటిన కేసులు, 52 మంది మృతి
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 10 వేలకు కరోనా కేసులు దాటాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4,11,905కి చేరుకొన్నాయి. ఒక్క రోజులో కరోనాతో 52 మంది చనిపోయారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 10 వేలకు కరోనా కేసులు దాటాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 4,11,905కి చేరుకొన్నాయి. ఒక్క రోజులో కరోనాతో 52 మంది చనిపోయారు.రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు 69,221కి చేరుకొన్నాయి. కరోనాతో మరణాల రేటు 0.50శాతానికి చేరుకొన్నాయి.ఇంకా రాష్ట్రంలో 5474 మంది పరీక్షలు రావాల్సి ఉంది.
ఆదిలాబాద్ జిల్లాలో 140, కొత్తగూడెంలో 174,జీహెచ్ఎంసీలో1440,జగిత్యాలలో 204, జనగామలో 160,భూపాలపల్లిలో101,కామారెడ్డిలో 279, కరీంనగర్ లో 369,ఖమ్మంలో 424, ఆసిఫాబాద్ 77, మహబూబ్‌నగర్ లో 417,మంచిర్యాలలో 195, మెదక్ లో 229,మల్కాజిగిరిలో 751,ములుగులో 79, నాగర్‌కర్నూల్ లో 257, నల్గొండలో469 లో కేసులు నమోదయ్యాయి.
నారాయణపేటలో 38,నిర్మల్ లో 129,నిజామాబాద్ లో 498,పెద్దపల్లిలో 169,సిరిసిల్లలో225, సంగారెడ్డిలో 262, సిద్దిపేటలో 230, సూర్యాపేటలో 308, వికారాబాద్ లో 281, వనపర్తిలో 157,వరంగల్ రూరల్ లో 233,వరంగల్ అర్బన్ 653, భువనగిరిలో 278 కేసులు రికార్డయ్యాయి.