హైదరాబాద్‌లో భూకబ్జాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అమ్ముకుంటోంది ఈ ముఠా. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న ముఠాలోని 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు
హైదరాబాద్‌లో భూకబ్జాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అమ్ముకుంటోంది ఈ ముఠా. దీంతో భూకబ్జాలకు పాల్పడుతున్న ముఠాలోని 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. జయ దశరథ ప్రాజెక్ట్ పేరుతో ఈ ముఠా మోసాలు చేస్తోంది. నిందితుల్లో ఒకరైన ఆదినారాయణ కొల్లూరులో 40 ఎకరాల భూమిని తప్పుడు పత్రాలతో ఇలాగే విక్రయించాడు. బాధితుల నుంచి రూ.8 కోట్ల 50 లక్షలను వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
