Cyber Warrior: సైబర్ వారియర్.. సైబర్ నేరాల కట్టడిపై ప్రత్యేక దృష్టి ..
Cyber Warrior: సైబర్ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ( టీఎస్‌సీఎస్‌బీ) ప్రత్యేక దృష్టి సారించింది. పోలీసుస్టేషన్లలో నమోదయ్యే సైబర్ నేరాల దర్యాప్తును ప్రతి పోలీసు స్టేషన్‌లో ఓ సైబర్ వారియర్ ఉండేలా చర్యలు చేపట్టింది.
Cyber Warrior: పెరుగుతున్న సైబర్ నేరాల కట్టడిపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) ప్రత్యేక దృష్టి సారించింది. నమోదయ్యే సైబర్ నేరాలను వేగవంతగా దర్యాప్తు చేయడానికి, బాధితులకు సత్వర న్యాయం చేకూర్చేందుకు ప్రతి పోలీసుస్టేషన్‌లో ఒక సైబర్ వారియర్ ఉండేలా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చర్యలు చేపట్టారు.
అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలోని 858 మంది కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లకు సైబర్ క్రైమ్ ఫిర్యాదులపై టీఎస్ సైబర్ క్రైమ్ స్టేట్ బ్యూరో (టీఎస్‌సీఎస్‌బీ) శిక్షణ ఇచ్చిందని బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ తెలిపారు. వారికి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో రెండు వారాల ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఇందులో 1930 ఫోన్‌లో ఫిర్యాదులను స్వీకరించడం, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP)లో నేరాన్ని నివేదించడం, అనుమానిత ఐడెంటిఫైయర్‌లను విశ్లేషించడం,
అలాగే సోషల్ మీడియా, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలపై దర్యాప్తు చేయడం వంటి వాటిపై వారికి శిక్షణ ఇచ్చారు. పోలీస్ స్టేషన్, టీఎస్‌సీఎస్‌బీ మధ్య సైబర్ వారియర్లు సమన్వయ కర్తలుగా పని చేస్తారని బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ తెలిపారు. శిక్షణ పొందిన వారు విధులు నిర్వహించే పోలీస్ స్టేషన్లలో నమోదయ్యే సైబర్ నేరాల విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉంటారని చెప్పారు.