Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. ఆవు కడుపులో 80 కిలోల ప్లాస్టిక్‌.. 8 గంటల శస్త్రచికిత్సతో

మెదక్ జిల్లా, పటాన్ చెరులో అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్‌ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. హైదరాబాద్‌ వీధుల్లో సంచరించే ఓ ఆవుకు ఆపరేషన్ చేయగా ఈ అమానుషం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. 

80kg of plastic and other waste found from stomach of cow - bsb
Author
Hyderabad, First Published Oct 31, 2020, 10:28 AM IST

మెదక్ జిల్లా, పటాన్ చెరులో అనారోగ్యంతో ఉన్న ఆవుకు ఆపరేషన్‌ చేసిన పశువైద్యులు దాని పొట్టలో నుంచి 80 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించారు. హైదరాబాద్‌ వీధుల్లో సంచరించే ఓ ఆవుకు ఆపరేషన్ చేయగా ఈ అమానుషం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. 

అనారోగ్యంతో ఉన్న 2 ఆవులను జీహెచ్‌ఎంసీ సిబ్బంది 20 రోజుల క్రితం అమీన్‌పూర్‌ గోశాలకు తరలించారు. కడుపు ఉబ్బరంతో బాధపడుతూ, ఆహారం తీసుకోక అనారోగ్యం పాలయ్యాయి. వాటిలో ఒక ఆవు మూడ్రోజుల క్రితం మృతి చెందగా.. మరో ఆవు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. 

దీంతో అమీన్‌పూర్‌ పశువైద్యాధికారి విశ్వచైతన్య ఆ ఆవుకు శస్త్ర చికిత్స చేసి దాని పొట్టలో పేరుకుపోయిన 80 కిలోల ప్లాస్టిక్, కాటన్‌ బట్టలు బయటకు తీశారు. ప్రస్తుతం ఆవు ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన తెలిపారు.
 
Follow Us:
Download App:
  • android
  • ios