Asianet News TeluguAsianet News Telugu

నోట్లో యాసిడ్ పోసి, ఆపై గుడ్డలు కుక్కీ.. వృద్ధురాలి దారుణ హత్య , ఒంటిపై నగలతో పరార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన దుండగులు.. ఆమె ఒంటిపై వున్న ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

80 years old women brutally killed in gajwel ksp
Author
First Published Nov 12, 2023, 6:58 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిథ్యం వహిస్తున్న గజ్వేల్‌లో వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన దుండగులు.. ఆమె ఒంటిపై వున్న ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతారుపల్లి గ్రామానికి చెందిన రాజవ్వ (80) అనే వృద్ధురాలి నోట్లో యాసిడ్ పోసి, గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడ్డారు గుర్తు తెలియని దుండగులు. అనంతరం ఆమె ఒంటిపై వున్న బంగారు ఆభరణాలు, కాళ్ల పట్టీలను అపహరించుకుపోయారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Follow Us:
Download App:
  • android
  • ios