వ్యవస్థ మీదే అసహనంతో అసెంబ్లీ బరిలో ఓ అమ్మ
వ్యవస్థ మద అసహనంతో 80 ఏళ్ల ఓ తల్లి అసెంబ్లీ బరిలోకి దిగింది. జగిత్యాల అసెంబ్లీ స్థానంలో నామినేషన్ దాఖలు చేసింది. అసలు ఆమె ఎన్నికల్లో నిలబడాలనే నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసుకుందాం.
హైదరాబాద్: ఆ తల్లి ఇప్పుడు రోడ్డు మీదికి వచ్చింది. కన్న కోడుకు చీదరించాడు. ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. తప్పుడు ధ్రువపత్రాలు చూపి ఇల్లు తనదే అన్నాడు. తాత్కాలికంగా వేరే చోట ఆమె ఆశ్రయం తీసుకుంది. న్యాయం కోసం కోర్టు మెట్టెక్కింది. కానీ, విచారణ ఆలస్యం అవుతూ వస్తున్నది. దీంతో ఆమెకు వ్యవస్థ మీదనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి లోనైంది. ఇంతలోనే ఎన్నికలు వచ్చాయి. వ్యవస్థ మీద అసహనంతో ఆమె అసెంబ్లీ బరిలో నిలబడాలని నిర్ణయించుకుంది.
సీటీ శ్యామలకు 80 ఏళ్లు. కొడుకు వద్దే ఉండేది. కానీ, ఆ కొడుకు అమ్మను శత్రవులా చూశాడు. అమ్మ కంటే ఆస్తే ఎక్కువ అని ఉద్రిక్త క్షణాలలో అనుకున్నాడు. ఇంట్లో నుంచి తల్లిని గెంటేశాాడు. దీంతో ఆ తల్లి జగిత్యాలలో ఉంటున్నది. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి.
Also Read: ప్రధానమంత్రి మోడీ సభకు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా.. ఎందుకో తెలుసా?
ఈ వ్యవస్థ మీద అసహనంతో 80 ఏళ్ల శ్యామల అసెంబ్లీ బరిలో నిలబడాలని నిశ్చయించుకుంది. అనుకున్నదే తడవుగా నామినేషన కూడా దాఖలు చేసింది. ఆమె ఇప్పుడు జగిత్యాల స్థానం నుంచి అసెంబ్లీ బరిలో నిలబడింది.