నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్నిలో 8 ఏళ్ల బాలుడు  తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వర్ని పోలీస్ స్టేషన్ లో  8 ఏళ్ల బాలుడు నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తండ్రిపై ఫిర్యాదు చేశాడు.

ప్రతి రోజూ తన తండ్రి తనను  కొడుతున్నాడని  ఆ బుడతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి నుంచి తనను రక్షించాలని కోరాడు. 8 ఏళ్ల పిల్లాడు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాకయ్యారు.

వెంటనే ఆ బాలుడి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఎందుకు కొడుతున్నావని  ఆ బాలుడి తండ్రిని పోలీసులు ప్రశ్నించారు. తాను కొట్టడం లేదని తండ్రి సమాధానం ఇచ్చారు.

బాలుడి  తండ్రికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. బాలుడిని కొట్టకూడదని  ఆ తండ్రికి హితవు చెప్పారు. ఆ చిన్నారికి ధైర్యం చెప్పి పంపారు పోలీసులు. కన్న తండ్రిపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి  ఫిర్యాదు చేయడంతో వర్నిలో ఆ బాలుడి గురించి  చ,ర్చ జరుగుతోంది.

 ఆ పిల్లాడు వర్నిలో ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ఆ బుడతడిని చూసేందుకు  జనం ఆ ఇంటికి క్యూ కట్టారు. మరోవైపు ధైర్యంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి తండ్రిపై పిర్యాదు చేసిన ఆ పిల్లాడిని పోలీసులు అభినందించారు.