Asianet News TeluguAsianet News Telugu

Corona Cases: తెలంగాణలో మరో 8 కరోనా కేసులు.. 30 శాంపిళ్ల రిజల్ట్ పెండింగ్

తెలంగాణలో కొత్తగా మరో 8 మంది కరోనా బారిన పడ్డారు. 1,333 మందికి గడిచిన 24 గంటల్లో టెస్టులు చేశారు. కాగా, మరో 30 మంది ఫలితాలు రావాల్సి ఉన్నది. రాష్ట్రంలో ఇప్పుడు చికిత్స తీసుకుంటున్న లేదా.. ఐసొలేషన్‌లో ఉన్నవారి సంఖ్య 59కు చేరింది.
 

8 new coronavirus cases in telangana state, 30 samples results in pending kms
Author
First Published Dec 27, 2023, 12:33 AM IST

Covid 19: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి కోరలు చాస్తున్నది. 2020 నుంచి ఈ వైరస్ మహమ్మారి రూపంలో ప్రపంచాన్నే వణికించింది. ఇటీవల ఇది వెనక్కి తగ్గిందని ఊపిరిపీల్చుకుంటున్న సందర్భంలో మరోసారి అది దాని ఉనికిని ప్రదర్శిస్తున్నది. ఇప్పుడు కొత్తగా జేఎన్1 వేరియంట్‌తో కొత్తరూపాన్ని ఎత్తింది. రాష్ట్రంలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి.

మంగళవారం ఒక్క రోజే రాష్ట్రంలో 8 మందికి వైరస్ వ్యాప్తి చెందింది. దీంతో మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 59కి పెరిగింది. గత 24 గంటల్లో (మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు) మొత్తం 1,333 మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ 24 గంటల్లో 8 మందికి కరోనా పాజిటివ్‌గా రిజల్ట్స్ వచ్చాయి. మరో 30 మంది శాంపిళ్ల రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం బులెటిన్‌లో పేర్కొంది.

Also Read: రేపల్లే వైసీపీ ఇంచార్జీ మార్పు.. ఆయనను అంత సింపుల్‌గా వదులుకోను: వైసీపీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ

ఏమాత్రం అలసత్వంగా ఉన్న వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. అందరూ జాగరూకతగా, ముందు జాగ్రత్తలు పాటిస్తేనే ఈ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. జేఎన్1 వేరియంట్ ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని చెబుతున్నారు. అయినా.. ముందు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలని అధికారులు ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios