హైద్రాబాద్ మణికొండలో వక్ఫ్ బోర్డు చైర్మెన్  సలీం పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన  ముఠా ఉదంతం ఒకటి వెలుగు చూసింది. సినిమా షూటింగ్ కోసం వక్ప్‌బోర్డు నుండి అనుమతి తీసుకోవాలని ఎనిమిది మంది సభ్యుల ముఠా బెదిరింపులకు పాల్పడింది. తొలుత రూ. 4 లక్షలు డిమాండ్ చేసిన ముఠా సభ్యులు చివరకు రూ. 50 వేలు తీసుకొన్నారు. సినిమా షూటింగ్ విషయమై అనుమతి విషయమై తాను ఎవరికి ఫోన్ చేయలేదని వక్ప్‌బోర్డు ఛైర్మెన్ సలీం మీడియాకు చెప్పారు. 


హైదరాబాద్: హైద్రాబాద్‌ వక్ఫ్‌బోర్డు ఛైర్మెన్ సలీం పేరు చెప్పి సినీ డైరెక్టర్‌ నుండి యూట్యూబ్ విలేకరుల బృందం రూ. 50 వేలను వసూలు చేశారు.వక్ఫ్‌బోర్డు ఛైర్మెన్ సలీం పేరు చెప్పి రూ. 4 లక్షలను ఎనిమిది మంది సభ్యులు డిమాండ్ చేశారు. వక్స్ బోర్డు చైర్మెన్ సలీంగా పరిచయం చేసుకొని సినీ డైరెక్టర్‌ ను బెదిరించారు. చివరకు ఈ ముఠా సభ్యులు రూ. 50 వేలను తీసుకొని వెళ్లారు.

సినిమా షూటింగ్ కోసం వక్ఫ్‌బోర్డు నుండి అనుమతులు తీసుకోలేదని నానా హంగామా చేశారని బాధితుడు మీడియాకు చెప్పారు. సినీ డైరెక్టర్ ఈ ముఠాకు రూ. 50 వేలను చెల్లించాడు.

స్థానిక పోలీసుల నుండి అనుమతి తీసుకొన్నా కూడ వక్ప్‌బోర్డు నుండి అనుమతి తీసుకోలేదనే నెపంతో డబ్బులు డిమాండ్ం చేశారని చెప్పారు. తమది పెద్ద సినిమా కాదని షార్ట్ ఫిల్మ్ అని చెప్పినా కూడ వినకుండా డబ్బులు డిమాండ్ చేశారని బాధితుడు తెలిపారు.

 ఇదిలా ఉంటే వక్వ్ బోర్డు ఛైర్మెన్ సలీం ఈ విషయమై తనకు సంబంధం లేదని చెప్పాడు.సినిమా షూటింగ్ అనుమతి విషయమై ఎవరికి కూడ ఫోన్ చేయలేదని సలీం తేల్చి చెప్పారు. ఈ విషయమై సినీ డైరెక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.