తెలంగాణలో కరోనా విశ్వరూపం: తాజాగా 7432 కేసులు, 32 మరణాలు
తెలంగాణలో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. తాజాగా 7 వేలకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ కారణంగా 32 మంది మరణించారు.l
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాయి. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 7432 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3.87 లక్షల మార్కును దాటింది.
కాగా, గత 24 గంటల్లో తాజాగా 32 కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం మరణాల సంఖ్య తెలంగాణలో 1961కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 58.148 యాక్టివ్ కేసులు ఉండగా, ఆస్పత్రుల నుంచి 3.26 లక్షల మంది డిశ్చార్జీ అయ్యారు.
హైదరాబాదులో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాపిస్తోంది. తాజాగా గత 24 గంటల్లో హైదరాబాద్ 1434 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యా.యి. రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల్లో కూడా కరోనా జోరు కొనసాగిస్తోంది. మేడ్చెల్ లో 606, రంగారెడ్డి జిల్లాలో 504 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలావుంటే, కుంభమేళాలో పాల్గొని తిరిగి వచ్చినవారికి తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. రాష్ట్రం నుంచి కుంభమేళాకు వెళ్లి తిరిగి వచ్చినవారు 14 రోజుల పాటు విధిగా హోం ఐసోలేషన్ లోకి వెళ్లాలని, కుటుంబ సభ్యుల నుంచి సామాజిక దూరం పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. ఇళ్లలో కూడా వారు మాస్కులు ధరించాలని సూచించింది.