Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి స‌ర్కారుపై బీజేపీ ఫైర్.. ప్రొటెం స్పీకర్ నియామకంపై గవర్నర్‌కు లేఖ

Telangana: ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఒవైసీ నియామకంపై గవర్నర్ కు ఏడుగురు బీజేపీ నేతల లేఖ రాశారు. కాగా, అక్బరుద్దీన్ ఓవైసీని తొలగించాలని తొలుత డిమాండ్ చేసిన రాజాసింగ్ శ‌నివారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనక‌పోవ‌డం గ‌మనార్హం.
 

7 BJP leaders write to Guv Tamilisai Soundararajan over Akbaruddin Owaisi's appointment as protem speaker RMA
Author
First Published Dec 9, 2023, 6:33 PM IST

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో కొత్తగా ఎన్నికైన ముఖ్య‌మంత్రి అనుముల‌ రేవంత్ రెడ్డి నాయ‌క‌త్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘిస్తోందని తెలంగాణ భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఆరోపించింది.  ఏఐఎంఐఎంకు చెందిన అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని  ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ క్ర‌మంలోనే బీజేపీకి చెందిన ఏడుగురు ఎన్నికైన ఎమ్మెల్యేలు గవర్నర్‌కు రాసిన లేఖలో ఆరోపించారు.

కొత్తగా ఎన్నికైన ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల ముసుగులో కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని కూడా బీజేపీ ఆరోపించారు. ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు మూడవ శాసనసభ సమావేశాల మొదటి సెషన్‌ను బహిష్కరించారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించిన ప్రక్రియలు, ప్రోటోకాల్‌లు, పూర్వాపరాలను నిర్మొహమాటంగా ఉల్లంఘించారని ఆరోపించారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 188 ప్రకారం అసెంబ్లీలో ఏళ్ల సంఖ్య పరంగా అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్ గా నామినేట్ చేయాలి. అక్బరుద్దీన్ ఒవైసీ కంటే సీనియర్లు చాలా మంది ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆయనను ప్రొటెం స్పీకర్ గా నియమించిందనీ, ఇది నిర్దేశిత నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు తమ లేఖలో ఆరోపించారు. అక్బరుద్దీన్ ఓవైసీని ప్రొటెం స్పీకర్ గా నియమించడం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందనీ, దీనిని రద్దు చేయాలని ఎమ్మెల్యేలు గవర్నర్ ను కోరారు. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా అత్యంత సీనియర్లను నియమించేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios